Share News

హోర్ముజ్‌ను మూసేశాం.. నౌకలు వస్తే కాల్చేస్తాం.. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరిక..

ABN , Publish Date - Mar 03 , 2026 | 10:17 AM

అంతర్జాతీయ ముడి చమురు రవాణాకు కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిని మూసేస్తున్నామని, ఏ నౌక అయినా దాటడానికి ప్రయత్నిస్తే కాల్చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, నౌకదళం ఆ పని చేస్తాయని వార్నింగ్ ఇచ్చింది.

హోర్ముజ్‌ను మూసేశాం.. నౌకలు వస్తే కాల్చేస్తాం.. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరిక..
Strait of Hormuz closed

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇప్పటికే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ మరింత ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ ముడి చమురు రవాణాకు కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిని మూసేస్తున్నామని, ఏ నౌక అయినా దాటడానికి ప్రయత్నిస్తే కాల్చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, నౌకదళం ఆ పని చేస్తాయని వార్నింగ్ ఇచ్చింది (Strait of Hormuz closed).


హోర్ముజ్ జలసంధిలో ఏదైనా అంతరాయం ఏర్పడితే ప్రపంచ వాణిజ్యంలో చాలా భాగం స్థంభించిపోతుంది. ఈ మార్గం ద్వారా ముడి చమురు, ఎల్‌ఎన్‌జీ అత్యధికంగా భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలకు ఎగుమతి అవుతాయి. కేవలం కొన్ని కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ ప్రాంతం గుండా ప్రపంచంలో వాడే చమురులో ఐదో వంతు రవాణా జరుగుతుంది. ఇంతటి కీలకమైన జలసంధి మూసుకుపోతే వేరే మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. దీంతో రవాణా, బీమా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి (Iran Revolutionary Guards warning).


ఇరాన్‌లో ఉద్రిక్తతలు మొదలైన కారణంగా ఇప్పటికే చమురు ధరలు భగ్గుమంటున్నాయి (Global oil supply risk). ఇప్పుడు ఈ హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసేయడంతో ధరలు మరింత పెరగడం ఖాయం. కాగా, ఈ జలసంధి గుండా ప్రయాణించేందుకు ఇప్పటికే 150 ఆయిల్ ట్యాంకర్లు ఎదురుచూస్తున్నాయి. హోర్ముజ్ తూర్పు వైపున 60 ట్యాంకర్లు వేచి చూస్తున్నాయి.


ఇవి కూడా చదవండి..

స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


మీ తెలివికి ఛాలెంజ్.. ఈ ఫొటోలో ఉన్న మూడు తప్పులను 10 సెకెన్లలో పట్టుకోండి..

Updated Date - Mar 03 , 2026 | 10:35 AM