Share News

గ్రహణం.. తెలుగు రాష్ట్రాల్లో తెరిచి ఉండే ఏకైక ఆలయం ఇదే

ABN , Publish Date - Mar 03 , 2026 | 09:43 AM

తిరుపతి సమీపంలోని శ్రీకాళహస్తి ఆలయానికి భక్తులు పోటెత్తారు. చంద్రగ్రహణం ఉన్నా శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయం తెరిచే ఉంటుంది.

గ్రహణం.. తెలుగు రాష్ట్రాల్లో తెరిచి ఉండే ఏకైక ఆలయం ఇదే
Sri Kalahasti Temple

తిరుపతి, మార్చి 3: రాహుగ్రస్థ సంపూర్ణ చంద్రగ్రహణం ఈరోజు(మంగళవారం) ఏర్పడనుంది. ఈ గ్రహణం శతభిషా నక్షత్రంలో సంభవిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఆలయాలు గ్రహణ సమయంలో మూసివేస్తారు. గ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ చేసిన అనంతరమే భక్తులకు దర్శనాలు అనుమతిస్తారు. చంద్రగ్రహణం సందర్భంగా తిరుపతి సమీపంలోని శ్రీకాళహస్తి ఆలయం తెరిచే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో గ్రహణ సమయంలో తెరిచి ఉండే ఏకైక ప్రధాన ఆలయం శ్రీకాళహస్తి. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు.


పురాణాల ప్రకారం.. ఏ గ్రహణమైనా సూర్యుడు, చంద్రుడిని కబళించేది రాహు, కేతువులే. శివుడు వీరికి గ్రహాధిపత్యం ఇచ్చాడని నమ్మకం. శ్రీకాళహస్తీశ్వరుడికి నవగ్రహ కవచం ఉంటుంది. ఈ ఆలయంలో నిత్యం రాహు-కేతు పూజలు నిర్వహిస్తారు. గ్రహణ సమయంలో దర్శించుకుంటే రాహు-కేతు దోషాలు, నక్షత్ర దోషాలు, నవగ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. గ్రహణ సమయంలో స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక గ్రహణకాల శాంతి అభిషేకాలు నిర్వహిస్తారు. గ్రహణం మధ్యాహ్నం సుమారు 3:20 గంటల నుంచి సాయంత్రం 6:47 గంటల వరకు కొనసాగనుంది.


ఇవి కూడా చదవండి...

హోలీ శుభాకాంక్షలు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్..

వైసీపీ మోసాలు ‘మూసివేత’!

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 03 , 2026 | 10:42 AM