అందరినీ క్షేమంగా తీసుకొస్తాం: మంత్రి కొండపల్లి
ABN , Publish Date - Mar 03 , 2026 | 05:11 AM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి ఆంధ్రులెవరూ అధైర్య పడొద్దని, అందరినీ క్షేమంగా తీసుకొస్తామని రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి ఆంధ్రులెవరూ అధైర్య పడొద్దని, అందరినీ క్షేమంగా తీసుకొస్తామని రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. గల్ఫ్ దేశాల్లో ఆంధ్రుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, అన్నివిధాలా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. సోమవారం న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఢిల్లీలోని సంబంధిత అధికారులతో స్వయంగా చర్చిస్తున్నామని తెలిపారు. ఐదారు లక్షలమంది తెలుగువారు గల్ఫ్ దేశాల్లో ఉన్నట్లు తమ వద్ద ప్రాథమిక సమాచారం ఉందని తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. స్థానికంగా ఉన్న ఇండియన్ ఎంబసీ సేవలను, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు. ఏపీ భవన్- 9871999430, ఏపీఎన్‌ఆర్టీఎ్‌స 0863-2340678 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.