హోలీ శుభాకాంక్షలు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్..
ABN , Publish Date - Mar 03 , 2026 | 07:56 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్ వేదిక పోస్టులు పెట్టారు.
అమరావతి, మార్చి 3: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్ వేదిక పోస్టులు పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన పోస్టులో.. ‘చంద్రబాబు ‘హోలీ పర్వదినం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. చెడు పై మంచి గెలుపునకు సూచికగా ‘కామ దహనం’తో ప్రారంభమయ్యే హోలీ పండుగ మనందరి జీవితాల్లో కొత్త రంగులు అద్దుతుంది. హోలీ పండుగ సందర్భంగా బంధుమిత్రులతో, సాటివారితో ఆనందం పంచుకుని అందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. హోలీ పండుగ సందర్భంగా అందరికి మరొక్కమారు శుభాకాంక్షలు తెలుపుతున్నాను’ అని పేర్కొన్నారు.
చెడుపై గెలిచిన మంచికి సంకేతం హోలీ: నారా లోకేశ్
మంత్రి నారా లోకేశ్ తన పోస్టులో.. ‘వసంత రుతువుకు స్వాగతం పలికే రంగుల సంబరం హోలీ. చెడుపై గెలిచిన మంచికి సంకేతం హోలీ. సమత, మమతలకు చిహ్నంగా, పేదా- పెద్ద తారతమ్యాలు లేకుండా, కులమత భేదాలు చూడకుండా రంగుల్లో అంతా కలిసిపోయి ఆనందాలను పంచుకునే హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
హోలీ 2026.. ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పండిలా..
పీఎఫ్ డిపాజిట్లపై 8.25శాతం వడ్డీ