Share News

హోలీ 2026.. ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పండిలా..

ABN , Publish Date - Mar 03 , 2026 | 06:54 AM

దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు సోమవారం రాత్రినుంచే మొదలయ్యాయి. మంగళవారం ఉదయం నుంచే జనం రంగుల్లో మునిగి తేలుతున్నారు.

హోలీ 2026.. ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పండిలా..
Happy Holi 2026 wishes

ఇంటర్‌నెట్ డెస్క్: చిన్నాపెద్దా సంతోషంగా జరుపుకునే హోలీ పండుగ ఈ రోజే. దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు సోమవారం రాత్రినుంచే మొదలయ్యాయి. మంగళవారం ఉదయం నుంచే జనం రంగుల్లో మునిగి తేలుతున్నారు. హోలీ రోజున ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకోవటం మామూలే. కొంతమంది నేరుగా ఎదుటి వ్యక్తికి శుభాకాంక్షలు చెబితే.. మరికొంత మంది మెసేజ్‌ల ద్వారా.. ఫేస్‌బుక్, వాట్సాప్ స్టాటస్‌ల ద్వారా శుభాకాంక్షలు చెబుతుంటారు. హ్యాపీ హోలీ అని మెసేజ్ పెట్టడం లేదా.. ఏదైనా ఇమేజ్ పంపటం చేస్తుంటారు. మీరు పెట్టే మెసేజ్ లేదా స్టాటస్ ప్రత్యేకంగా ఉండాలంటే.. ఇలా శుభాకాంక్షలు చెప్పండి.


స్నేహితులు, బంధువులకు మెసేజ్ రూపంలో శుభాకాంక్షలు చెప్పడానికి..

  • రంగుల పండుగ హోలీ మీ జీవితంలో సరికొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు.

  • ఈ రంగుల హోలీ.. మీ ఇంట కురిపించాలి సుఖశాంతుల చిరు జల్లులు. మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు.

  • ఈ హోలీ రంగులు మీ జీవితాన్ని ఆనందమయం చేయాలని, మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని ఆశిస్తున్నాను. హ్యాపీ హోలీ.

  • రంగుల హోలీ.. అందరి జీవితాల్లో నింపాలి వెలుగుల కేళి. హ్యాపీ హోలీ!.

  • ప్రేమ, స్నేహాల కలయికే ఈ హోలీ.. అందరికీ హోలీ శుభాకాంక్షలు!.

  • మీ జీవితం ఎప్పుడూ రంగులమయంగా ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ హోలీ!.


వాట్సాప్, ఫేస్‌బుక్ స్టాటస్‌ల కోసం..

  • మన జీవితం ఓ కాన్వాస్. దాన్ని హోలీ రంగులతో అందంగా తీర్చిదిద్దుదాం! హ్యాపీ హోలీ 2026!"

  • ద్వేషాన్ని వీడదాం.. రంగులతో స్నేహాన్ని చాటుదాం! Happy Holi!

  • ఈ హోలీ మీ లైఫ్ లో కొత్త రంగులు, కొత్త ఉత్సాహాన్ని నింపాలని కోరుకుంటూ.. హ్యాపీ హోలీ.

  • వసంతం రాకతో.. ప్రకృతి పులకించే వేళ.. రంగుల కేళిలో.. మనసు మురిసే వేళ.. అందరికీ హోలీ శుభాకాంక్షలు.

  • చిరునవ్వుల రంగులు.. స్నేహానురాగాల హరివిల్లులు.. మీ ఇంట వెలయాలి సుఖ సంతోషాల సిరిమల్లెలు.

  • రంగు పడాల్సిందే.. గెటప్ మారాల్సిందే! మన దోస్తులందరికీ హ్యాపీ హోలీ.

  • మురికి పోతుంది కానీ.. ఈ మెమొరీస్ ఎప్పటికీ ఉండిపోతాయి! లెట్స్ సెలబ్రేట్ హోలీ.


ఇవి కూడా చదవండి

స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

పీఎఫ్‌ డిపాజిట్లపై 8.25శాతం వడ్డీ

Updated Date - Mar 03 , 2026 | 07:26 AM