Share News

పీఎఫ్‌ డిపాజిట్లపై 8.25శాతం వడ్డీ

ABN , Publish Date - Mar 03 , 2026 | 05:35 AM

ఉద్యోగుల భవిష్యనిధి (పీఎఫ్‌) డిపాజిట్లపై 2025-26 సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ చెల్లించనున్నట్టు కార్మిక శాఖ సంస్థ ప్రకటించింది.

పీఎఫ్‌ డిపాజిట్లపై 8.25శాతం వడ్డీ

న్యూఢిల్లీ, మార్చి 2: ఉద్యోగుల భవిష్యనిధి (పీఎఫ్‌) డిపాజిట్లపై 2025-26 సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ చెల్లించనున్నట్టు కార్మిక శాఖ సంస్థ ప్రకటించింది. వరుసగా మూడో ఏడాది కూడా ఇదే వడ్డీ రేటు కొనసాగనుండడం విశేషం. 2022-23లో వడ్డీ రేటు 8.15 శాతం ఉండగా, మరుసటి ఏడాది 8.25శాతంకు పెరిగింది. అప్పటి నుంచి అదే కొనసాగుతోంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌లాల్‌ మాండవీయ అధ్యక్షతన సోమవారం జరిగిన ఈపీఎఫ్‌ఓ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీ (సీబీటీ) సమావేశంలో వడ్డీ రేటుపై నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒడిదుడుకులు ఎదురవుతున్నప్పటికీ వడ్డీ రేట్లను కొనసాగిస్తున్నట్టు కార్మిక శాఖ తెలిపింది. గుర్తింపు పొందిన పీఎఫ్‌ ట్రస్టులకు ఆదాయపు పన్ను విభాగం, ఇతరత్రా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ఏక కాల ఆమ్నెస్టీ స్కీంను అమలు చేయనున్నట్టు పేర్కొంది. ఆరు నెలల వ్యవధిలో కేసులు, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం కలిగిస్తుంది. పీఎ్‌ఫల మినహాయింపులకు సంబంధించి సరళతరం చేసిన ప్రామాణిక కార్యాచరణ విధివిధానాల (ఎస్‌ఓపీ)ను కూడా ఆమోదించింది. రూ.1000 కన్నా తక్కువ నిల్వ ఉంటే ఆ సొమ్మును నేరుగా ఖాతాదార్ల బ్యాంకు అకౌంట్లో జమ చేసే ప్రయోగాత్మక ప్రాజెక్టుకు కూడా ఆమోదం తెలిపింది.

Updated Date - Mar 03 , 2026 | 05:35 AM