Share News

ఇరాన్‌పై యుద్ధాన్ని బలవంతంగా రుద్దారు.. పాక్ రక్షణ శాఖ మంత్రి ఆగ్రహం

ABN , Publish Date - Mar 03 , 2026 | 05:06 PM

చర్చలకు ఇరాన్ సిద్ధంగా ఉన్నా బలవంతంగా యుద్ధాన్ని రుద్దారని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. దీని వెనుక జియోనిస్టు కుట్ర ఉందని చెప్పారు.

ఇరాన్‌పై యుద్ధాన్ని బలవంతంగా రుద్దారు.. పాక్ రక్షణ శాఖ మంత్రి ఆగ్రహం
Khawaja Asif on Iran - Israel War

ఇంటర్నెట్ డెస్క్: మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలపై పాకిస్థాన్ తొలిసారిగా స్పందించింది. చర్చలకు ఇరాన్‌ సిద్ధంగా ఉన్నా బలవంతంగా యుద్ధాన్ని రుద్దారని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ప్రాబల్యాన్ని పాక్ సరిహద్దుల వరకూ విస్తరించే లక్ష్యంతో రూపొందించిన విస్తృత జియోనిస్టు ఎజెండాలో ఇది భాగమని అన్నారు. ఈ కుట్రను పాక్ అర్థం చేసుకోవాలని అన్నారు.

జియోనిజమ్‌తో (ఇజ్రాయెల్ జాతీయవాదం) మానవాళికి ముప్పు పొంచి ఉందని మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచీ నేటి వరకూ ఇస్లామిక్ ప్రపంచం ఎదుర్కొన్న ప్రతి యుద్ధం వెనుక జియోనిస్ట్ భావజాలం పాత్ర ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉందని అన్నారు. దాదాపు 100 ఏళ్లుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను జియోనిస్టు భావజాలమే నియంత్రిస్తోందని చెప్పారు. ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలు ఈ సిద్ధాంతానికి బందీలుగా మారాయని వ్యాఖ్యానించారు.


అఫ్గానిస్థాన్, ఇరాన్, భారత్‌‌లు కేంద్రంగా ఉన్న ఎజెండాకు పాక్‌ టార్గెట్ అవుతుందని కూడా మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరించారు. అన్ని వైపులా శత్రువులు చుట్టుముడతారని అన్నారు. చివరకు పాక్ ఒక సామంత రాజ్యంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అయితే, పాకిస్థాన్ సైనిక, అణు శక్తిని ప్రపంచమంతా గుర్తించిందని కూడా పాక్ మంత్రి చెప్పారు. పాక్ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు అమరులైన ప్రతి ఒక్కరికీ దేశం రుణపడి ఉంటుందని మంత్రి అన్నారు. పాక్ ఎప్పటికీ శక్తిమంతంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.


ఇవి కూడా చదవండి

ఇరాన్‌పై అమెరికా దాడులను ఖండించిన చైనా

ఇది ముగింపు లేని యుద్ధం కాదు: యూఎస్ మంత్రి పీటర్ హెగ్సెత్

Updated Date - Mar 03 , 2026 | 06:25 PM