Share News

భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోంది.. పాక్ అధ్యక్షుడి సంచలన ఆరోపణలు..

ABN , Publish Date - Mar 03 , 2026 | 11:14 AM

భారతదేశం మరో యుద్ధానికి సిద్ధమవుతోందని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ పేర్కొన్నారు. పాకిస్థాన్ పార్లమెంటు సంయుక్త సమావేశంలో మాట్లాడిన జర్దారీ.. భారతదేశం ఇస్లామాబాద్‌తో మరో యుద్ధానికి సిద్ధమవుతోందని ఆరోపించారు.

భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోంది.. పాక్ అధ్యక్షుడి సంచలన ఆరోపణలు..
Asif Ali Zardari Claims

భారతదేశం మరో యుద్ధానికి సిద్ధమవుతోందని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ పేర్కొన్నారు. పాకిస్థాన్ పార్లమెంటు సంయుక్త సమావేశంలో మాట్లాడిన జర్దారీ.. భారతదేశం ఇస్లామాబాద్‌తో మరో యుద్ధానికి సిద్ధమవుతోందని ఆరోపించారు. యుద్ధం విషయంలో న్యూఢిల్లీ వెనక్కి తగ్గి శాంతియుత చర్చలకు రావాలని పిలుపునిచ్చారు (Pakistan President statement).


'భారత నాయకులు మరో యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు. వారికి నా సందేశం ఏమిటంటే.. యుద్ధ ఆలోచనల నుంచి అర్థవంతమైన చర్చల వైపునకు మళ్లండి. ప్రాంతీయ భద్రతకు అదే ఏకైక మార్గం' అని జర్దారీ అన్నారు. పాక్ పార్లమెంట్‌లో ఆయన మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.


కాగా, ఇటీవల అఫ్గానిస్థాన్ దాడులకు భారత్‌ను కారణంగా చూపిస్తూ జర్దారీ, ఇతర పాక్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు (India Pakistan tensions). అఫ్గాన్ నేతలు భారత్‌కు ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వేరే దేశం తమ ఆశయాల కోసం అఫ్గాన్‌ను యుద్ధ భూమిగా ఉపయోగించుకోవడాన్ని ఆపండని అన్నారు. అలాగే సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయాలనే భారతదేశ నిర్ణయాన్ని కూడా జర్దారీ విమర్శించారు. నీటి ప్రవాహాలను ఆయుధంగా వాడుకోవాలనుకోవడం సరికాదని అన్నారు.


గత సంవత్సరం పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు చేసింది (Asif Ali Zardari Claims). పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. నాలుగు రోజుల తర్వాత రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.


ఇవి కూడా చదవండి..

స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


మీ తెలివికి ఛాలెంజ్.. ఈ ఫొటోలో ఉన్న మూడు తప్పులను 10 సెకెన్లలో పట్టుకోండి..

Updated Date - Mar 03 , 2026 | 11:19 AM