తనకు ఇష్టమైన తెలుగు హీరో ఎవరో చెప్పిన సంజు
ABN , Publish Date - Mar 03 , 2026 | 07:41 AM
ఒక్కే ఒక్క మ్యాచ్‌తో స్టార్‌గా మారాడు టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్. టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో50 బంతుల్లో 97 పరుగులతో అద్భుతంగా రాణించాడు. ఒవైపు వికెట్లు పడుతున్న మరోవైపు నిలబడి మొక్కవోని ధైర్యం నిలబడి టీమిండియాను గెలిపించాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఒక్కే ఒక్క మ్యాచ్‌తో స్టార్‌గా మారాడు టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్(Sanju Samson). టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో50 బంతుల్లో 97 పరుగులతో అద్భుతంగా రాణించాడు. ఒవైపు వికెట్లు పడుతున్న మరోవైపు నిలబడి మొక్కవోని ధైర్యం నిలబడి టీమిండియాను గెలిపించాడు. వెస్టిండీస్ మ్యాచ్‌లో సంజు ప్రదర్శన అనిర్వచనీయం అంటూ క్రీడా నిపుణులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాంటి సంజు శాంసన్ సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో తనకు ఇష్టమైన తెలుగు హీరో ఎవరో సంజు వెల్లడించాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...
ఓ ర్యాపిడ్ ఫైర్ చిట్ చాట్‌లో సంజు మాట్లాడుతూ.. టాలీవుడ్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపాడు. తాను మలయాళిగా అల్లు అర్జున్ సినిమాలన్నింటినీ చూస్తానని వెల్లడించాడు. అల్లు అర్జున్‌తో పాటు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తనకు ఇష్టమని తెలిపాడు. మహేష్ బాబు స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటాయని అన్నాడు. గతంలో ఎక్స్ వేదికగా జరిగిన ఓ చిట్‌చాట్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో సౌత్ హీరోల గురించి మాట్లాడిన సంజు.. మహేష్ బాబు క్లాస్ యాక్టింగ్ తనకు ఇష్టమని తెలిపాడు. గతంలో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సంజు అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ కూడా చేశాడు.
'ఆర్ఆర్ఆర్' సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ వచ్చినప్పుడు సంజు సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. సౌత్ ఇండియన్ సినిమా గ్లోబల్ స్థాయికి చేరడం గర్వంగా ఉందని పేర్కొన్నాడు. తెలుగు మాస్ మసాలా సినిమాలు తనకు బాగా నచ్చుతాయని, తెలుగు మాస్ సాంగ్స్ తనలో ఉత్తేజాన్ని నింపుతాయని సంజు ఓ ఇంటర్వ్యూలో సరదాగా చెప్పుకొచ్చాడు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు తాను డై హార్డ్ ఫ్యాన్ అని తెలిపిన సంజు.. అరుణాచలం సినిమాలోని డైలాగ్స్ చెప్పి నవ్వులు పూయించాడు.
ఇవి కూడా చదవండి: