Share News

వాళ్ల కోసం.. జహీర్‌, భజ్జీ

ABN , Publish Date - Mar 03 , 2026 | 05:28 AM

ర్థమాన ఆటగాళ్ల శిక్షణ కోసం భారత మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌, మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌లకు బీసీసీఐ ఆహ్వానం పలికింది. వయస్సు విభాగ టోర్నీలు...

 వాళ్ల కోసం..  జహీర్‌, భజ్జీ

బెంగళూరు: వర్థమాన ఆటగాళ్ల శిక్షణ కోసం భారత మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌, మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌లకు బీసీసీఐ ఆహ్వానం పలికింది. వయస్సు విభాగ టోర్నీలు, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌, భారత్‌ ‘ఎ’లలో అద్భుత ప్రదర్శన చేసిన కొంతమంది ఎంపిక చేసిన క్రికెటర్ల కోసం సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్సీ (సీఓఈ) ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే జహీర్‌ ఖాన్‌ ఐదు రోజుల శిబిరంలో పాల్గొని యువ పేసర్లకు కోచింగ్‌ ఇస్తున్నాడు. ‘మాజీలు జహీర్‌, హర్భజన్‌లతో పాటు కుంబ్లేను కూడా సీఓఈ చీఫ్‌ లక్ష్మణ్‌ సంప్రదించాడు. ఆఫ్‌ స్పిన్నర్ల క్యాంప్‌నకు త్వరలోనే భజ్జీ రానున్నాడు. అలాగే లెగ్‌ స్పిన్నర్లకు కుంబ్లే శిక్షణ ఇచ్చే అవకాశం కూడా ఉంది’ అని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.

ఇవి కూడా చదవండి:

విండీస్‌పై విజయం.. ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఎవరంటే?

అతడి హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైంది.. సంజుపై సూర్య ప్రశంసలు

Updated Date - Mar 03 , 2026 | 05:28 AM