Share News

విండీస్‌పై విజయం.. ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఎవరంటే?

ABN , Publish Date - Mar 02 , 2026 | 04:44 PM

టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో ఆదివారం విండీస్‌పై టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సెమీస్‌కు అర్హత సాధించింది. అయితే టీమ్ మేనేజ్‌మెంట్ ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మెడల్ బుమ్రాకు అందింది.

విండీస్‌పై విజయం.. ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఎవరంటే?
Jasprit Bumrah

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో ఆదివారం విండీస్‌పై టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ సంజు శాంసన్(97*) అద్భుత నాక్ ఆడి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అయితే ప్రతి మ్యాచ్ తర్వాత టీమ్ మేనేజ్‌మెంట్ ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మెడల్ ఇస్తుందనే విషయం తెలిసిందే. విండీస్‌పై గెలుపు తర్వాత ఈ మెడల్ బుమ్రాకు అందింది.


విండీస్‌పై బుమ్రా ఒకే ఓవర్లో రెండు వికెట్లను పడగొట్టిన విషయం తెలిసిందే. డేంజరస్ బ్యాటర్లు షిమ్రోన్ హెట్‌మయెర్, రోస్టన్ ఛేజ్ వికెట్లను బుమ్రా తీసుకున్నాడు. దీంతో వెస్టిండీస్ దూకుడును భారత్ కట్టడి చేయగలిగింది. అంతకుముందు తన సతీమణి, క్రికెట్ కామెంటేటర్ సంజనా గణేశన్‌తో బుమ్రా చిట్‌చాట్ చేశాడు. ఈ సందర్భంగా ఆఖర్లో మరింత దూకుడు ప్రదర్శించిన శివం దూబే, సంజు శాంసన్‌లపై ప్రశంసల వర్షం కురిపించాడు.


‘గత నెల ముందు వరకు సంజు శాంసన్ తన కెరీర్‌లో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నాడు. అయినా సరే ఓపికగా అవకాశం కోసం ఎదురుచూశాడు. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు. తన కర్తవ్యం ఏంటో అతడికి తెలుసు. సంజు సక్సెస్ కావడం సంతోషంగా అనిపించింది. మున్ముందు ఇదే దూకుడుతో ఆడాలని కోరుకుంటున్నా. మరోవైపు శివం దూబే.. ఆఖర్లో అతడు కొట్టిన రెండు బౌండరీల వల్ల ఒత్తిడి అంతా పోయింది. క్రికెట్ గురించి బాగా తెలిసిన వారికి మాత్రమే ఆ రెండు ఫోర్ల విలువ అర్థమై ఉంటుంది. ఎందుకంటే చివరి ఓవర్లో ఒక్కోసారి ఎనిమిది లేదా తొమ్మిది పరుగులు చేయడమే చాలా క్లిష్టంగా మారతుంది. లక్ష్య ఛేదనలో ముందు ఓవర్లోనే వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టాలి’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు.


ఇవి కూడా చదవండి:

2011 ప్రపంచ కప్: అదే 97 పరుగులు.. గంభీర్ చారిత్రాత్మక నాక్‌ను గుర్తు చేసిన సంజు శాంసన్

భారత పర్యటనకు అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు.. ఏ మ్యాచ్‌లు ఎప్పుడెప్పుడంటే?

Updated Date - Mar 02 , 2026 | 04:45 PM