Share News

భారత పర్యటనకు అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు.. ఏ మ్యాచ్‌లు ఎప్పుడెప్పుడంటే?

ABN , Publish Date - Mar 02 , 2026 | 02:20 PM

జూన్ 2026లో అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఇందులో భాగంగా భారత్‌తో ఓ టెస్ట్, మూడు వన్డేలు ఆడనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్ వేదికగా అధికారంగా ప్రకటించింది.

భారత పర్యటనకు అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు.. ఏ మ్యాచ్‌లు ఎప్పుడెప్పుడంటే?
Afghanistan Cricket Team

ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. జూన్ 2026లో టీమిండియాతో పలు మ్యాచ్‌ల్లో తలపడనుంది. ఈ విషయాన్ని సోమవారం బీసీసీఐ ఎక్స్ వేదికగా ధ్రువీకరించింది. ఇందులో భాగంగా ఓ టెస్ట్, మూడు వన్డేలు భారత్‌తో అఫ్గానిస్తాన్ ఆడనున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించి షెడ్యూల్‌ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.


ఏకైక టెస్ట్ మ్యాచ్ జూన్ 6 నుంచి 10 వరకు న్యూ చంఢీగడ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్ ఇదే మైదానంలో జరగనున్న తొలి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ కానుంది. జూన్ 14, 17, 20 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. టీమిండియా, అఫ్గానిస్తాన్ ఇప్పటి వరకు కేవలం ఒక టెస్ట్ మ్యాచ్‌లో మాత్రమే తలపడ్డాయి. ఆ మ్యాచ్ 2018లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుదీర్ఘ ఫార్మాట్లో ఈ ఇరుదేశాల క్రికెట్ జట్లు ముఖాముఖి తలపడలేదు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇరు జట్లు అంతర్జాతీయ మ్యాచ్‌లో తలపడనున్నాయి.


షెడ్యూల్ ఇదే..

  • టెస్ట్ మ్యాచ్: జూన్ 6-10(న్యూ చంఢీగడ్)

  • తొలి వన్డే: జూన్ 14 (ధర్మశాల)

  • రెండో వన్డే: జూన్ 17(లఖ్‌నవూ)

  • మూడో వన్డే: జూన్ 20(చెన్నై)


ఇవి కూడా చదవండి:

వెస్టిండీస్‌పై పదేళ్ల తర్వాత పగ తీర్చుకున్న టీమిండియా

టీ20 డబ్ల్యూసీ: సంజుపై టీమిండియా కోచ్ గంభీర్ కీలక కామెంట్స్

Updated Date - Mar 02 , 2026 | 02:20 PM