Share News

భారత్‌పై మరోసారి విషం కక్కిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్

ABN , Publish Date - Mar 02 , 2026 | 09:24 AM

విండీస్‌పై టీమిండియా ఆడిన తీరుకు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ఎప్పటిలాగానే పాకిస్థాన్ ఆటగాళ్లు మాత్రం తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు.

భారత్‌పై మరోసారి విషం కక్కిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్
Saqlain Mushtaq

ప్రస్తుతం జరుగుతున్న టీ-20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. కోల్‌కతాలో ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్బుత ఆటతీరు కనబరిచింది. 196 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించి క్రికెట్ అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. విండీస్‌పై టీమిండియా ఆడిన తీరుకు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ఎప్పటిలాగానే పాకిస్థాన్ ఆటగాళ్లు మాత్రం తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు (Indian Cricket Council remark).


పాకిస్థాన్ మాజీ ఆటగాడు సక్లయిన్ ముస్తాక్ ఆదివారం నాటి మ్యాచ్‌కు ముందు చేసిన కామెంట్లు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచ క్రికెట్‌ను బీసీసీఐ ఏలుతోందని, బీసీసీఐ ఏది చెబితే ఐసీసీ అదే ఫాలో అవుతుందని ముస్తాక్ ఆరోపించాడు. 'ఐసీసీ అంటే ఇండియన్ క్రికెట్ కౌన్సిల్. బీసీసీఐ చెప్పిందే ఐసీసీ చేస్తుందనడంలో సందేహం లేదు. భారత్‌కు అనుకూలంగానే ఈడెన్ గార్డెన్స్ పిచ్‌ను సిద్ధం చేసి ఉంటారు. అందులో సందేహం లేదు' అని ముస్తాక్ అన్నాడు (Saqlain Mushtaq Comments).


ఐసీసీ పక్షపాత ధోరణితో వ్యవహరించడం వల్లే ఈ టీ-20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీ-ఫైనల్ వరకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముస్తాక్ పేర్కొన్నాడు (ICC pitch bias claim). ముస్తాక్ వ్యాఖ్యలపై టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. గొప్ప క్రికెటర్ అయిన సక్లయిన్ ముస్తాక్ కనీస పరిజ్ఞానం లేని వ్యక్తిలా మాట్లాడుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు. పాకిస్థాన్ నిష్క్రమణతో ఆ దేశ మాజీ ఆటగాళ్లకు బుర్రలు పని చేయడం లేదని కొందరు విమర్శించారు.


ఇవి కూడా చదవండి..

కోల్‌కతాలో సంజూ వీర విహారం.. దాసోహమైన రికార్డులివే..


స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Mar 02 , 2026 | 10:40 AM