కోల్‌కతాలో సంజూ వీర విహారం.. దాసోహమైన రికార్డులివే..
ABN , Publish Date - Mar 02 , 2026 | 07:13 AM
పెద్దగా అంచానాల్లేని సంజూ శాంసన్ ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియాకు ఆపద్భాందవుడిలా నిలిచాడు. అద్భుత బ్యాటింగ్‌తో భారత జట్టును సెమీ ఫైనల్ చేర్చాడు. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్నాడు.
పెద్దగా అంచానాల్లేని సంజూ శాంసన్ ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియాకు ఆపద్భాందవుడిలా నిలిచాడు. అద్భుత బ్యాటింగ్‌తో భారత జట్టును సెమీ ఫైనల్ చేర్చాడు. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. మొదటి నుంచి చివరి బంతి వరకు క్రీజులో నిలిచి టీమిండియాను గెలిపించాడు. ఈ నేపథ్యంలో కోల్‌కతాలో కొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు (Sanju Samson records).
టీ-20 ప్రపంచకప్‌లలో ఛేజింగ్ చేస్తున్నప్పుడు భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సంజూ (97 నాటౌట్) రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ఈ ఘనత విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. కోహ్లీ 2022లో పాకిస్థాన్‌పై ఛేజింగ్ చేస్తూ 82 పరుగులు చేశాడు. అలాగే అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ అర్ధశతకాలు చేసిన భారత్ వికెట్ కీపర్‌గా కూడా సంజూ ఘనత సాధించాడు. ఇప్పటివరకు మొత్తం ఆరు హాఫ్ సెంచరీలు చేశాడు. సంజూ తర్వాతి స్థానంలో ఇషాన్ కిషన్ (5) ఉన్నాడు (India T20 World Cup).
ఇక, టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో బ్యాటర్‌గా సంజూ శాంసన్ నిలిచాడు (India semifinal qualification). సంజూ కంటే ముందు సురేశ్ రైనా (101) ఉన్నాడు. ఆదివారం కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 196 పరుగుల లక్ష్య ఛేదనలో సంజూ చివరి వరకు క్రీజులో ఉండి భారత జట్టును గెలిపించాడు. ఈ విజయంతో టీమిండియా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. గురువారం జరిగే రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడబోతోంది.
ఇవి కూడా చదవండి
చేరుకునే దారి లేకే చేజారిన ప్రాణాలు
ఆ రాశి వారికి ఈ వారం ఆర్థికస్థితి సామాన్యం