Share News

ఆ రాశి వారికి ఈ వారం ఆర్థికస్థితి సామాన్యం

ABN , Publish Date - Mar 01 , 2026 | 07:27 AM

ఈ వారం రాశిఫలాలు.. అనుగ్రహం 1 - 7 మార్చి 2026 పి.ప్రసూనా రామన్‌, ఆ రాశి వారికి ఈ వారం అన్నివిధాలా యోగదాయక

ఆ రాశి వారికి ఈ వారం ఆర్థికస్థితి సామాన్యం

అనుగ్రహం

1 - 7 మార్చి 2026

పి.ప్రసూనా రామన్‌

మేషం

అశ్విని, భరణి,

కృత్తిక 1వ పాదం

mesham.jpgగ్రహస్థితి బాగుంది. పరిస్థితులు చక్కబడతాయి. ప్రతీ విషయంలోనూ మీదే పైచేయి. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్‌ వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వ వద్దు. ప్రతీ వ్యవహారం స్వయంగా చూసు కోండి. ఆహ్వానం అందుకుంటారు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పిల్లల భవిష్యత్తుపై దృష్టిపెట్టండి. పుణ్యకార్యంలో పాల్గొంటారు.


వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి,

మృగశిర 1,2 పాదాలు

vrushabham.jpgమీదైన రంగంలో నిలదొక్కు కుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సమర్థతను చాటుకుంటారు. సన్నిహితులతో తరచూ సంభాషిస్తుంటారు. ఖర్చులు అధికం. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యపరీక్షలు అనివార్యం. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. ప్రభుత్వ కార్యాల యాల్లో పనులు సానుకూలమవుతాయి. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి.


మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర,

పునర్వసు 1,2,3 పాదాలు

mithunam.jpgవ్యవహారానుకూలత ఉంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ధనలాభం ఉంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పరిచయం లేని వారితో జాగ్రత్త. మీ నుంచి విషయం రాబట్టేందుకు కొందరు యత్నిస్తారు. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది.


కర్కాటకం

పునర్వసు 4వ

పాదం, పుష్యమి, ఆశ్లేష

karkatakam.jpgకార్యసాధనకు ఓర్పు ముఖ్యం. యత్నాలు విరమించుకోవద్దు. మనోధైర్యంతో అడుగు ముందుకేయండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ధనం మితంగా వ్యయంచేయండి. పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. కీలక పత్రాలు అందుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతి పాదనలకు సానుకూల స్పందన లభిస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు.


సింహం

మఖ, పుబ్బ,

ఉత్తర 1వ పాదం

simham.jpgప్రతికూలతలు అధికం. ఆలోచనలు నిలకడగా ఉండవు. రావలసిన ధనం సౌమ్యంగా వసూలు చేసుకోవాలి. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ధైర్యంగాయత్నాలు సాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. చిన్న విషయానికే చికాకుపడతారు. అయిన వారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. పిల్లల చదువులపై దృష్టిపెడతారు. జూదాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.


కన్య

ఉత్తర 2,3,4; హస్త,

చిత్త 1,2 పాదాలు

kanya.jpgఅన్నివిధాలా యోగదాయకమే. మీ కష్టం ఫలిస్తుంది. స్థిరాస్తి ధనం అందు కుంటారు. ఖర్చులు భారమనిపించవు. స్థిమి తంగా పనులు పూర్తి చేస్తారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముం దుకు సాగవు. కొత్త విషయాలు తెలుసుకుం టారు. ఫోన్‌ సందేశాలను పట్టించుకోవద్దు. గృహమరమ్మతులు చేపడతారు. పక్కవారి నుంచి అభ్యంతరాలు ఎదురవుతాయి.


తుల

చిత్త 3,4; స్వాతి,

విశాఖ 1,2,3 పాదాలు

tula.jpgశుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. పర స్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. పనులు త్వరితగతిన సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. మీ ఉన్నతిని చాటుకోవటానికిఅతిగా ఖర్చుచేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వం స్వీకరిస్తారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. చిన్నచిన్న విషయాలు పట్టించుకోవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త యత్నాలు చేపడతారు.


వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

vruchikam.jpgతలపెట్టిన కార్యం సిద్థిస్తుంది. లక్ష్యం సాధిస్తారు. స్థిరచరాస్తి ధనం అందుతుంది. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. కొత్త సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి. మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఆహ్వానం అందుకుంటారు. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. పత్రాల్లో సవరణలు సాను కూలమవుతాయి. అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.


ధనుస్సు

మూల, పూర్వాషాఢ,

ఉత్తరాషాఢ 1వ పాదం

dhanussu.jpgమీ ఓర్పునకు పరీక్షా సమయం. కార్యసాధనకు మరింత శ్రమించాలి. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పనులు మొక్కు బడిగా పూర్తి చేస్తారు. ఆప్తుల కలయిక వీలు పడదు. మొండిగా యత్నాలు కొనసాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. శుభకార్యం తలపెడతారు.


మకరం

ఉత్తరాషాఢ 2,3,4;

శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

makaram.jpgఆర్థికస్థితి సామాన్యం. నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. పనుల సానుకూ లతకు మరింత శ్రమించాలి. కష్టపడినా ఫలితం శూన్యం. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్తేజప రుస్తాయి. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలకు తావివ్వవద్దు. దూరపు బం ధువుల ఆహ్వానం అందుతుంది. యోగ, ధార్మికతల పట్ల ఆసక్తి కలుగుతుంది.


కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

kumbham.jpgసర్వత్రా యోగదాయకం. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. కుటుంబీకులతో సంద్రింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆప్తులకు సాయం అందిస్తారు. సన్నిహితులతో తరచూ సంభా షిస్తుంటారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకా శం లభిస్తుంది. శుభకార్యం నిశ్చయమ వుతుంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.


మీనం

పూర్వాభాద్ర 4వ

పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

meemam.jpgవ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. అనుభ వజ్ఞులను సంప్రదించండి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పనులు అర్థాంతరంగా ముగిస్తారు. ఖర్చులు విపరీతం. పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ఫోన్‌సందే శాలు పట్టించుకోవద్దు. పిల్లల ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. శుభకార్యానికి హాజరవుతారు. బంధుమిత్రుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం, వెండిపై వార్ ఎఫెక్ట్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

తిరుపతిలో మరో చారిత్రక ఘట్టం.. 16 కోర్టు భవనాలకు భూమి పూజ

Read Latest Telangana News and National News

Updated Date - Mar 01 , 2026 | 07:27 AM