రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులో సీఎం, డిప్యూటీ సీఎం పేలుడు ఘటనపై చర్చ
ABN , Publish Date - Mar 01 , 2026 | 07:09 AM
రాజమహేంద్రవరం విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒకరికొకరు ఎదురుపడ్డారు.
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వారి మధ్య బాణసంచా పేలుడు ఘటనపై చర్చ జరిగినట్లు తెలిసింది. ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలు, క్షతగాత్రులను పరామర్శించిన సీఎం అమరావతికి వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు విచ్చేశారు. అదే సమయంలో బాధితుల పరామర్శకు కాకినాడ బయలుదేరిన పవన్ కల్యాణ్ ఎయిర్‌పోర్టులో దిగారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై నేతలిద్దరూ చర్చించుకున్నట్టు సమాచారం. ఆ సమయంలో వారి వెంట మంత్రి నారాయణ కూడా ఉన్నారు.