Share News

టీ20 డబ్ల్యూసీ: సంజుపై టీమిండియా కోచ్ గంభీర్ కీలక కామెంట్స్

ABN , Publish Date - Mar 02 , 2026 | 10:56 AM

భారత జట్టు ప్రధాన కోచ్‌ గౌతమ్ గంభీర్‌ సంజు శాంసన్‌పై ప్రశంసలు కురిపించాడు. అతడొక వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్‌ అంటూ ఆకాశానికెత్తాడు. నిన్న వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో సంజు అద్భుతంగా ఆడి.. టీమిండియాను గెలిపించిన సంగతి తెలిసిందే.

టీ20 డబ్ల్యూసీ: సంజుపై టీమిండియా కోచ్ గంభీర్ కీలక కామెంట్స్
Sanju Samson

స్పోర్ట్స్ డెస్క్: ఒక మ్యాచ్.. ఒక్కే ఒక్క మ్యాచ్ ఒక ప్లేయర్ స్థితిని మార్చేసింది. అప్పటి వరకు ఎన్నో అవమానాలు, ఛీత్కారములు ఎదుర్కొన్న వ్యక్తి.. కీలక మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి.. ప్రశంసలు అందుకున్నాడు. అతడే టీమిండియా ఓపెనర్, వికెట్ కీపర్ సంజు శాంసన్(Sanju Samson). టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా నిన్న(ఆదివారం) వెస్టిండీస్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్ సెమీస్‌కు చేరిందంటే.. అందుకు కారణం సంజునే. తాజాగా అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ సంజు శాంసన్‌పై ప్రశంసలు కురిపించాడు.


సంజు శాంసన వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్‌ అంటూ గంభీర్ ఆకాశానికెత్తాడు. సరైన సమయంలో రాణించి తన విలువను మరోసారి చాటుకున్నాడని గంభీర్ కొనియాడాడు. 'సంజు మంచి ప్లేయర్ అనే విషయం అందరికీ తెలుసు. అతని ప్రతిభ గురించి ఎవరికీ సందేహం అవసరం లేదు. అయితే, కొన్నిసార్లు అతడు విఫలమైనా మద్దతుగా నిలవడం అవసరం. మేము కూడా అదే పని చేశాము. జట్టుకు అతడి అవసరం ఉన్న కీలక సమయంలో రాణించి.. సత్తా చాటాడు. తన పూర్తి స్థాయి నైపుణ్యాలను ప్రదర్శించి.. జట్టుకు విజయం అందించాడు. అతడు వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్‌ అని నేను తరచూ చెబుతూ ఉంటాను. ఇకపై కూడా అతడి నుంచి ఇలాంటి ఇంకెన్నో ఇన్నింగ్స్‌ చూడాలని కోరుకుంటున్నా. సెమీఫైనల్‌కు వెళ్లే కీలక మలుపులో అతను తన అసలైన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు’ అని సంజును గంభీర్‌( Gautam Gambhir) ప్రశంసించాడు.


కాగా వెస్టిండీస్‌తో(West Indies) చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కోల్‌కతాలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు భారీ స్కోర్ చేసింది.లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 199 పరుగులు సాధించింది. ఓపెనర్ గా వచ్చిన సంజు శాంసన్ (97*) చివరి వరకు ఉండి.. భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. ఫలితంగా ఐదు వికెట్ల తేడాతో గెలిచి గ్రూప్‌-1 నుంచి సౌతాఫ్రికాతో పాటు సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకుంది. ముంబై వేదికగా గురువారం సెమీ ఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది.


ఇవి కూడా చదవండి:

భారత్‌పై మరోసారి విషం కక్కిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్

కోల్‌కతాలో సంజూ వీర విహారం.. దాసోహమైన రికార్డులివే..

Updated Date - Mar 02 , 2026 | 10:56 AM