Share News

అతడి హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైంది.. సంజుపై సూర్య ప్రశంసలు

ABN , Publish Date - Mar 02 , 2026 | 03:52 PM

టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. సంజు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

అతడి హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైంది.. సంజుపై సూర్య ప్రశంసలు
Suryakumar Yadav Praise Sanju Samson

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ సంజు శాంసన్(97*) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. సంజు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.


‘మేం ఆడిన విధానంతో మాకు చాలా ఆనందంగా ఉంది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్లంతా అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా సంజు శాంసన్ గురించి చెప్పాలి. ఓపికగా ఎదురుచూసిన మంచి మనుషులకు ఎప్పటికైనా మంచే జరుగుతుంది. సంజు విషయంలో అదే జరిగింది. ఇదంతా అతడి హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైంది. అతడు ఆడిన విధానం జట్టుకు విజయాన్ని అందించింది. మరోవైపు మా బౌలర్లు ప్రణాళిక ప్రకారమే బంతులు సంధించారు. అలాగే బ్యాటర్లు కూడా బాగా ఆడారు. భాగస్వామ్యాలే కీలకం అయ్యాయి. క్రికెట్‌లో ఒత్తిడి సాధారణం. కానీ అలాంటి పరిస్థితుల్లోనూ ధైర్యంగా బ్యాటర్లు పరుగులు తీయాలి. ఒత్తిడి లేకుండా ఆనందమే లేదు’ అని సూర్య పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి:

2011 ప్రపంచ కప్: అదే 97 పరుగులు.. గంభీర్ చారిత్రాత్మక నాక్‌ను గుర్తు చేసిన సంజు శాంసన్

భారత పర్యటనకు అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు.. ఏ మ్యాచ్‌లు ఎప్పుడెప్పుడంటే?

Updated Date - Mar 02 , 2026 | 04:00 PM