Share News

ఆ ఏరియాల్లో మధ్యాహ్నం 2.30 నుంచి కరెంట్ కట్

ABN , Publish Date - Mar 03 , 2026 | 07:34 AM

విద్యుత్‌ మరమ్మతుల కారణంగా గ్రీన్‌ ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కరెంటు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు.

ఆ ఏరియాల్లో మధ్యాహ్నం 2.30 నుంచి కరెంట్ కట్

  • నగరంలో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు

పంజాగుట్ట(హైదరాబాద్): విద్యుత్‌ మరమ్మతుల కారణంగా గ్రీన్‌ ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కరెంటు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ సత్యనారాయణ(ADE Satyanarayana) ఓ ప్రకటనలో తెలిపారు. 11కేవీ ఎర్రగడ్డ ఫీడర్‌ పరిధిలోని బీఎస్‏పురికాలనీ, సుల్తాన్‌నగర్‌, శంకర్‌లాల్‌నగర్‌, నటరాజ్‌నగర్‌, నేతాజీనగర్‌ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30గంటల వరకు,


city2.2.jpg11కేవీ ఆదిత్య ఎన్‌ క్లేవ్‌ ఫీడర్‌ పరిధిలోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌, వింధ్యా ఎన్‌ క్లేవ్‌, కుమ్మరిబస్తీ, ఇమ్రోజ్‌హోటల్‌, అనంద్‌బజార్‌(Anand Bazaar), జీన్స్‌కార్నర్‌, కాకతీయ మెస్‌, అమీర్‌పేట్‌ ప్రధాన రహదారి ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పీఎఫ్‌ డిపాజిట్లపై 8.25శాతం వడ్డీ

కాలేజీలో లైంగిక దాడి

Read Latest Telangana News and National News

Updated Date - Mar 03 , 2026 | 07:34 AM