కాలేజీలో లైంగిక దాడి
ABN , Publish Date - Mar 03 , 2026 | 05:33 AM
బాచుపల్లిలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల వేదికగా దారుణం. ఆ కళాశాల విద్యార్థినిని అదే కళాశాలకు చెందిన మరో విద్యార్థి స్నేహం, ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు.
ఏడాదిన్నరగా బీటెక్ విద్యార్థినిపై కాలేజ్‌మేట్ అత్యాచారం
బాచుపల్లిలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం
నిజాంపేట్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): బాచుపల్లిలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల వేదికగా దారుణం. ఆ కళాశాల విద్యార్థినిని అదే కళాశాలకు చెందిన మరో విద్యార్థి స్నేహం, ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఏడాదిన్నర కాలంపాటు మత్తు చాక్లెట్లు ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేశాడు. యువతి నిస్సహాయతను ఆసరాగా తీసుకొని అదే కళాశాలకు చెందిన అతని స్నేహితుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇద్దరిపై బాచుపల్లి పోలీసులు అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... బాచుపల్లిలోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలో చదువుతున్న యువతిని అదే కళాశాలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న సిర్రా ఆశిష్ తనయ్ మాయ మాటలతో దగ్గరయ్యాడు. ప్రేమిస్తున్నానని వెంటపడటంతో పాటు ఆమెకు ఇష్టం లేకున్నా కాలేజీ ఆవరణలోని తరగతి గదుల్లో ఆశిష్ ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమెకు ఇష్టం లేకున్నా.. పలుమార్లు ఖాళీ తరగతి గదుల్లో, హోటళ్లు, ఓయో రూములకు తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడి చేశాడు. డార్క్ వెబ్ నుంచి కొనుగోలు చేసిన మత్తు మందులను గర్భ నిరోధక మాత్ర(ఐపిల్)పేరుతో యువతికి ఇచ్చేవాడని పోలీసులు పేర్కొన్నారు. మాత్రలు తీసుకున్న యువతి దాదాపు 3 గంటల పాటు మత్తులో ఉండిపోయేదని, ఆ సమయంలో ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఆమెతో ఏకాంతంగా ఉన్న సమయంలో ఫొటోలు వీడియోలు తీసుకొని వాటిని సోషల్ మీడియాలో పెడతానని, తల్లిదండ్రులకు పంపుతానని బెదిరించి, లొంగదీసుకున్నాడని వెల్లడించారు. నిందితుడు డార్క్ వెబ్ ద్వారా మత్తు మందులను చాక్లెట్‌ల రూపంలో తెప్పించేవాడని, గర్భనిరోధక మాత్రల పేరుతో తినిపించే వాడని చెప్పారు. ఏడాదిన్నర కాలం పాటు ఈ దారుణం కొనసాగింది. ఆశి్‌షతనకు యువతితోఉన్న సంబంధం గురించి అదే కళాశాలలో చదివే ప్రవీణ్‌తో చెప్పాడు. ఇదే అవకాశంగా తీసుకున్న ప్రవీణ్ మాట్లాడాలని యువతిని గత ఏడాది ఫిబ్రవరిలో గండిమైసమ్మ సమీపంలోని హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. అక్కడ నుంచి తప్పించుకున్న యువతి వీరిద్దరి వేధింపులను భరించలేక పోయింది. డిప్రెషన్‌కు గురైంది. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కళాశాల నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. వారు ఎంక్వైరీ కమిటీ వేశామని చెప్పినా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంతో శనివారం యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దాంతో తల్లిదండ్రులు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.