అమలాపురంలో ఫైర్ క్రాకర్స్ తయారీ కేంద్రాలపై పోలీసుల ఆకస్మిక దాడులు..
ABN , Publish Date - Mar 03 , 2026 | 04:00 PM
అమలాపురంలో ఫైర్ క్రాకర్స్ షాపులు, తయారీ కేంద్రాలపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకుండా నడుస్తున్న షాపులను డీఎస్పీ ప్రసాద్ సీజ్ చేశారు.
అంబేద్కర్ కోనసీమ, మార్చి 3: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో ఫైర్ క్రాకర్స్ షాపులు, తయారీ కేంద్రాలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. అమలాపురంలో ఫైర్ క్రాకర్స్ తయారీ కేంద్రాలను పరిశీంచిన డీఎస్పీ ప్రసాద్.. అనుమతులు లేకుండా నడుస్తున్న షాపులను సీజ్ చేశారు. ఇటీవల వేట్లపాలెంలో జరిగిన ఫైర్ క్రాకర్స్ యాక్సిడెంట్ నేపథ్యంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అమలాపురంలో దీపావళి మందుల తయారీ, అమ్మకాలపై కఠిన నియంత్రణలు అమలు చేస్తున్నారు.
అమలాపురం డివిజన్‌లోని ఐదు షాపులకు అనుమతులు లేకపోవడంతో సీజ్ చేశారు డీఎస్పీ. కలెక్టర్ నుంచి తగిన అనుమతులు పొందిన తర్వాత మాత్రమే షాపులు తెరవాలని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా ఫైర్ క్రాకర్స్ తయారీ లేదా అమ్మకాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ప్రసాద్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ
దుర్గగుడిలో మహా కుంభాభిషేక మహోత్సవం.. సీఎంకు ఆహ్వానం
Read Latest AP News And Telugu News