Share News

తొలి దళిత స్పీకర్ బాలయోగి వర్ధంతి సందర్భంగా నారా లోకేశ్ నివాళులు

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:23 PM

లోక్‌సభ తొలి దళిత స్పీకర్ బాలయోగి వర్ధంతి సందర్భంగా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారాయన.

తొలి దళిత స్పీకర్ బాలయోగి వర్ధంతి సందర్భంగా నారా లోకేశ్ నివాళులు
Nara Lokesh

ఇంటర్నెట్ డెస్క్: లోక్‌సభ తొలి దళిత స్పీకర్, టీడీపీ సీనియర్ నాయకుడు జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ నివాళులర్పించారు. సామాన్య కుటుంబంలో జన్మించి లోక్‌సభ సభాపతిగా ఎదిగి.. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా పోస్ట్ చేశారు.


'లోక్‌సభ తొలి దళిత స్పీకర్, టీడీపీ సీనియర్ నేత స్వర్గీయ జీఎంసీ బాలయోగి గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. ఆయన.. దళితులు, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషిచేశారు. సామాన్య కుటుంబంలో జన్మించి లోక్‌సభ స్పీకర్‌గా ఎదిగారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. దేశానికి, రాష్ట్రానికి వారు అందించిన సేవలు చిరస్మరణీయం. కోనసీమ ముద్దుబిడ్డ బాలయోగి గారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషిచేద్దాం' అని తన ఎక్స్‌ ఖాతాలో రాసుకొచ్చారు లోకేశ్.


1951లో జన్మించిన బాలయోగి.. 1991లో తెలుగుదేశం పార్టీ తరఫున 10వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ రాజకీయంగా తన ఉనికిని కొనసాగించారు. ఆ తర్వాత ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర ఉన్నత విద్యా మంత్రిగా సేవలందించారు. 1998లో మరోసారి ఆయన పార్లమెంటుకు ఎన్నికయ్యారు. దాంతో లోక్‌సభ స్పీకర్‌గా నియమితులై.. తొలి దళిత వ్యక్తిగా గుర్తింపు పొందారు. చివరకు 2002 మార్చి 3న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కైకలూరులో బెల్ 206 హెలికాప్టర్ ప్రమాదంలో బాలయోగి మృతిచెందారు.


ఇవీ చదవండి:

పాకిస్థాన్ క్రికెట్ జట్టు హీరోకు ఘోర అవమానం

పరీక్షల కాలం.. తినాలి పోషకాహారం

Updated Date - Mar 03 , 2026 | 12:23 PM