Share News

పరీక్షల కాలం.. తినాలి పోషకాహారం

ABN , Publish Date - Mar 03 , 2026 | 10:50 AM

పరీక్షల కాలం మొదలయ్యింది. ఇప్పటికే ఇంటర్‌ పరీక్షలు మొదలు కాగా, మార్చి 14 నుంచి పదోతరగతి పరీక్షలు, మే 4 ఎప్‌సెట్‌ ఆ వెంటనే డిగ్రీ, ఎడ్‌సెట్‌, బీఎడ్‌, బీటెక్‌, ఐసెట్‌ తదితర వార్షిక ప్రవేశ పరీక్షలు ఉన్నాయి.

పరీక్షల కాలం.. తినాలి పోషకాహారం

  • పుస్తకాలతో కుస్తీ పట్టడమే కాదు.. ఆరోగ్యమూ చూసుకోవాలి

  • విద్యార్థులకు సూచిస్తున్న నిపుణులు

సికింద్రాబాద్: పరీక్షల కాలం మొదలయ్యింది. ఇప్పటికే ఇంటర్‌ పరీక్షలు మొదలు కాగా, మార్చి 14 నుంచి పదోతరగతి పరీక్షలు, మే 4 ఎప్‌సెట్‌ ఆ వెంటనే డిగ్రీ, ఎడ్‌సెట్‌, బీఎడ్‌, బీటెక్‌, ఐసెట్‌ తదితర వార్షిక ప్రవేశ పరీక్షలు ఉన్నాయి. ఏడాదంతా చదివిన విద్యార్థులు పరీక్షల కోసం తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. పుస్తకాలతో కుస్తీ పడుతూ సరైన ఆహారం తీసుకోరు. రాత్రంతా మేలుకొని చదువుతుంటారు. మరో వైపు ఎండలు ముదురుతుండటంతో విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు 8 గంటల పాటు కంటి నిండా నిద్రపోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుంది.


city7.2.jpgవీటిని పాటిద్దాం..

డ్రైఫ్రూట్స్‌, బాదం, కాజు, వాల్‌నట్స్‌, పిస్తా, నువ్వులతో కూడిన ఆహారం తీసుకోవడంతో మెదడుకు చురుకుదనం, జ్ఞాపకశక్తి మెరుగవుతాయి. తాజాపండ్లు, ఆకుకూరలు తీసుకోవాలి. సరిగ్గా తినకపోవడంతో నీరసం, ఏకాగ్రత తగ్గడం, శక్తి లోపించడం వంటి సమస్యలు వస్తాయి. పరీక్షల రోజుల్లో నాన్‌వెజ్‌కి దూరంగా ఉండాలి. ఫాస్ట్‌ఫుడ్‌ తినకపోవడం ఉత్తమం. డీహైడ్రేషన్‌కు గురికాకుండా రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి. అవసరమైతే నిమ్మరసం, మజ్జిగా తీసుకోవాలి.


20:20:20 ఫార్ములాతో చదవాలి

పరీక్షల వేళా విద్యార్థులు 20 నిమిషాలపాటు చదివి.. 20 సెకన్లపాటు కళ్లకు రెస్ట్‌ ఇవ్వాలి. ప్రతీ 20 నిమిషాలకు ఒకసారి ఇలా చేయడంతో కంటిపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. విద్యార్థులు చదువుతున్న రూమ్‌లో 20 సెకన్లపాటు నాలుగు మూలలు పైకి చూస్తే కంటిపై భారం తగ్గుతుంది.

- డా.యాకేందర్‌రెడ్డి, కంటి వైద్య నిపుణులు, ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌


city7.jpgసమయానికి నిద్ర పోవాలి

పరీక్షల సమయంలో నిద్ర కీలకం, ఒత్తిడిని తగ్గించి.. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ప్రతీ రోజు కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. ఉదయం లేచిన వెంటనే వ్యాయామం చేయాలి.


ఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

హోలీ హంగామా!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 03 , 2026 | 10:50 AM