పాకిస్థాన్ క్రికెట్ జట్టు హీరోకు ఘోర అవమానం
ABN , Publish Date - Mar 03 , 2026 | 10:57 AM
పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ 2026 హీరో సాహిబ్‌జాదా ఫర్హాన్‌కు ఘోర అవమానం జరిగింది. హండ్రెడ్ లీగ్ 2026 వేలం తుది జాబితాలో అతనికి అవకాశం దక్కలేదు.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి పాకిస్థాన్ ఔటైన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో వచ్చిన ఆ జట్టుకు తీవ్ర నిరాశే ఎదురైంది. అయితే పాకిస్థాన్ ప్లేయర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ ఈ ఐసీసీ టోర్నీలో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో టాప్ లో ఉన్నాడు. ఈ టోర్నీలో అద్భుతంగా రాణించాడు. అలాంటి పాకిస్థాన్ ప్రపంచ కప్ హీరోకి ఘోర అవమానం జరిగింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...
ఇంగ్లండ్ వేదికగా జరిగే హండ్రెడ్ లీగ్ 2026 వేలం తుది జాబితాలో ఫర్హాన్‌కు అవకాశం దక్కలేదు. ఈ ఏడాది పొట్టి ప్రపంచ కప్ లో రెండు సెంచరీలతో సహా పలు భారీ రికార్డులు నెలకొల్పినా ఫర్హాన్ పేరు వేలం జాబితాలో కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఫర్హాన్ సహా 49 పాకిస్థాన్ ప్లేయర్ల పేర్లు ఈ జాబితాలో లేకపోవడం క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. కాగా హండ్రెడ్ లీగ్‌లో తొలిసారి వేలం ద్వారా ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. ఈ ఆక్షన్ మార్చి 11, 12 తేదీల్లో లండన్ వేదికగా జరుగనుంది. ఈ వేలంలో తొలుత 710 మంది ప్లేయర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 63 మంది పాకిస్థాన్ క్రికెటర్లు ఉన్నారు.
అయితే ఫ్రాంచైజీలు 75 నుంచి100 మంది ఆటగాళ్లను మాత్రమే షార్ట్‌లిస్ట్ చేయమని ఆదేశించింది. అయితే చివరికి 243 మంది ఆటగాళ్లను తుది జాబితాలో చేర్చారు. వారిలో పాకిస్థాన్ నుంచి కేవలం 14 మంది అవకాశం దక్కింది. ఈ జాబితాలో పాక్ పేసర్ షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్, సైమ్ అయూబ్ ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ కప్ 2026లో అత్యధిక పరుగులు చేసిన ఫర్హాన్ సహా 49 మంది పాక్ ఆటగాళ్ల పేర్లు గల్లంతయ్యాయి. ఓ సింగిల్ ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఫర్హాన్ రికార్డ్ క్రియేట్ చేశారు. మరోవైపు, ప్రపంచ కప్ జట్టులో లేని పాక్ పేసర్ హారిస్ రౌఫ్ వేలంలో మార్‌కీ ఆటగాడిగా ఎంపిక కావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. కాగా, హండ్రెడ్ లీగ్ వేలం జాబితాలో పాక్ స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్ పేర్లు కూడా లేవు. ఈ ఇద్దరు విండీస్‌తో టెస్ట్ సిరీస్ కారణంగా తమ పేర్లు నమోదు చేసుకోలేదు.
ఇవి కూడా చదవండి:
ఈ ఆటంకాలు దాటితేనే సూర్యసేన ట్రోఫీని ముద్దాడేది.. లేకుంటే ..?
తనకు ఇష్టమైన తెలుగు హీరో ఎవరో చెప్పిన సంజు