Share News

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ కొత్త రక్షణ మంత్రి సైయద్ మాజిద్ అల్‌-రేజా మృతి

ABN , Publish Date - Mar 03 , 2026 | 06:04 PM

పశ్చిమాసియాలో నాలుగో రోజు కూడా దాడులు, ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అమెరికా మద్దతుతో ఇరాన్‌పై ఇజ్రాయెల్ మిసైళ్లతో విరుచుకుపడుతోంది. తాజా దాడుల్లో ఇరాన్ కొత్త రక్షణ మంత్రి సైయద్ మాజిద్ అల్-రేజా మృతి చెందినట్టు 'ది స్పెక్టేటర్ ఇండెక్స్' వెల్లడించింది.

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ కొత్త రక్షణ మంత్రి సైయద్ మాజిద్ అల్‌-రేజా మృతి
Seyed Majid Ebn Al-Reza

టెహ్రాన్: పశ్చిమాసియాలో నాలుగో రోజు కూడా దాడులు, ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అమెరికా మద్దతుతో ఇరాన్‌పై ఇజ్రాయెల్ మిసైళ్లతో విరుచుకుపడుతోంది. తాజా దాడుల్లో ఇరాన్ కొత్త రక్షణ మంత్రి సైయద్ మాజిద్ అల్-రేజా మృతి చెందినట్టు 'ది స్పెక్టేటర్ ఇండెక్స్' వెల్లడించింది.


రెండు రోజుల క్రితమే ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ సనీర్జాదే ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందాడు. దీంతో వెంటనే కొత్త రక్షణ మంత్రిగా అల్-రేజా బాధ్యతలు చెపట్టారు. అల్ రేజా ఇంతకుముందు డిప్యూటీ రక్షణ మంత్రిగా ఉండేవారు. తాజాగా అల్‌రేజా కూడా తమ దాడుల్లో మరణించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఇరాన్ మాత్రం అధికారికంగా ఈ వార్తను ధ్రువీకరించలేదు.


ఇవి కూడా చదవండి..

ఇరాన్‌లోని నటాంజ్ అణుశుద్ధి కేంద్రంపై దాడిని ధ్రువీకరించిన ఐఏఈఏ

ఇరాన్‌పై అమెరికా దాడులను ఖండించిన చైనా

Updated Date - Mar 03 , 2026 | 06:15 PM