Share News

భారీగా తగ్గిన వెండి ధరలు.. స్థిరంగా బంగారం రేటు..

ABN , Publish Date - Mar 03 , 2026 | 10:48 AM

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావంతో భారీగా పెరిగిన వెండి ధరలు కిందకు దిగి వచ్చాయి. మరోవైపు బంగారం ధర కూడా స్వల్ప తగ్గుదల నమోదు చేసింది. సోమవారం భారీగా పెరిగిన వెండి మంగళవారం కిందకు దిగి వచ్చింది.

భారీగా తగ్గిన వెండి ధరలు.. స్థిరంగా బంగారం రేటు..
gold and silver rates today

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావంతో భారీగా పెరిగిన వెండి ధరలు కిందకు దిగి వచ్చాయి. మరోవైపు బంగారం ధర కూడా స్వల్ప తగ్గుదల నమోదు చేసింది. సోమవారం భారీగా పెరిగిన వెండి మంగళవారం కిందకు దిగి వచ్చింది. కేజీకి రూ.20 వేల మేర తగ్గింది. మరోవైపు బంగారం ధర కూడా కాస్తంత తగ్గింది (Gold prices).


ఈ రోజు (మార్చి 3న) ఉదయం 10:30 గంటల సమయంలో హైదారాబాద్ బులియన్ మార్కె‌ట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,70,020కు చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే దాదాపు రూ.500 మేర తగ్గుదల నమోదు చేసింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,850 దగ్గర ఉంది (live gold rates). నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.450 మేర తగ్గింది.


మరోవైపు వెండి ధర భారీ తగ్గుదల నమోదు చేసింది. మంగళవారం కిలోకు ఏకంగా రూ.20 వేల మేర తగ్గింది. దీంతో తిరిగి మూడు లక్షల మార్క్‌ దిగువకు వచ్చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.95 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.82 లక్షలుగా ఉంది.

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి..

స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


మీ తెలివికి ఛాలెంజ్.. ఈ ఫొటోలో ఉన్న మూడు తప్పులను 10 సెకెన్లలో పట్టుకోండి..

Updated Date - Mar 03 , 2026 | 10:48 AM