Share News

కొనసాగుతున్న ఇరాన్ దాడులు.. రియాద్‌లో యూఎస్ ఎంబసీ టార్గెట్..

ABN , Publish Date - Mar 03 , 2026 | 08:09 AM

పశ్చిమాసియలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ సుప్రీం లీడర్ అయుతొల్లా అలీ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఆమెరికా వైమానిక స్థావరాలు, ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, రాయబార కార్యాలయాలపై దాడులను ముమ్మరం చేసింది.

కొనసాగుతున్న ఇరాన్ దాడులు.. రియాద్‌లో యూఎస్ ఎంబసీ టార్గెట్..
US Embassy Riyadh attack

పశ్చిమాసియలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ సుప్రీం లీడర్ అయుతొల్లా అలీ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఆమెరికా వైమానిక స్థావరాలు, ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, రాయబార కార్యాలయాలపై దాడులను ముమ్మరం చేసింది. తాజాగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అమెరికా ఎంబసీపై డ్రోన్‌లతో విరుచుకుపడింది (US Embassy Riyadh attack).


రియాద్‌లోని అమెరికా ఎంబసీపై రెండు డ్రోన్లతో దాడి జరిగిందని సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో ఆ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ అలముకుంది. దీంతో ఎంబసీ భవనానికి స్వల్పంగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. దాడి సమయంలో కార్యాలయం మొత్తం ఖాళీగా ఉండడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ వాటిల్లలేదని సమాచారం. ఈ క్రమంలో సౌదీలోని రియాద్, జెడ్డా, దహ్రాన్‌లో ఉన్న అమెరికన్లు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అక్కడి అమెరికా రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది (Riyadh drone strike).


తాజా దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు పరోక్షంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు (Trump warning Iran). 'రియాద్‌లోని అమెరికా ఎంబసీపై జరిగిన దాడి, సైనికుల హత్యకు ప్రతిస్పందన ఎంత తీవ్రంగా ఉంటుందో వారు త్వరలోనే తెలుసుకుంటారు' అని ట్రంప్ హెచ్చరించారు. కాగా, సోమవారం కువైట్‌లోని అమెరికా ఎంబసీపై కూడా ఇరాన్ దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి..

స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


మీ తెలివికి ఛాలెంజ్.. ఈ ఫొటోలో ఉన్న మూడు తప్పులను 10 సెకెన్లలో పట్టుకోండి..

Updated Date - Mar 03 , 2026 | 08:10 AM