ఇరాన్ దిగి వచ్చింది.. కానీ ఇప్పటికే ఆలస్యమైంది: ట్రంప్
ABN , Publish Date - Mar 03 , 2026 | 07:13 PM
అమెరికాతో చర్చలకు సిద్ధమంటూ ఇరాన్ దిగి వచ్చింది. అలాంటి వేళ ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దేశానికి చెందిన మిలటరీ నాయకత్వంతోపాటు రక్షణ రంగానికి చెందిన సామర్థ్యాలను నాశనం చేశామన్నారు.
వాషింగ్టన్, మార్చి 03: అమెరికాతో చర్చలకు సిద్ధమంటూ ఇరాన్ దిగి వచ్చింది. అలాంటి వేళ ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దేశానికి చెందిన మిలటరీ నాయకత్వంతోపాటు రక్షణ రంగానికి చెందిన సామర్థ్యాలను నాశనం చేశామన్నారు. ఇదంతా జరిగిన తర్వాత తమతో చర్చలకు సిద్ధమని ఇరాన్ అంటోందని పేర్కొన్నారు. కానీ ఇప్పటికే ఆలస్యమైందనంటూ ట్రంప్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
అమెరికా వద్ద ఆధునిక ఆయుధాలు ఉన్నాయని.. అవి కూడా అపరమితంగా ఉన్నాయని వివరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్రంప్ వెల్లడించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు రీగన్ లాగా.. అధ్యక్షుడు కూడా నేలపై బూట్లు వేయకుండానే ప్రపంచాన్ని మార్చడానికి ఒక మార్గాన్ని కనుగొన్నారంటూ వైట్ హౌస్ మాజీ స్పీచ్ రైటింగ్ డైరెక్టర్ మార్క్ థిస్సెన్ రాసిన కాలమ్‌కు ప్రతిస్పందిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అలాగే ఎప్పటికీ విజయవంతంగా యుద్ధం చేస్తూనే ఉండగలమన్నారు. అమెరికా కోసం ఉన్నతశ్రేణి ఆయుధాలను ఇతర దేశాల్లో సైతం నిల్వ చేసినట్లు ట్రంప్ వివరించారు. ఇక యూఎస్ మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌పై విమర్శలు చేశారు. ఆయన ఆయుధాల నిల్వలను సరిగ్గా నిర్వహించలేదంటూ మండిపడ్డారు. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు భారీ ఎత్తున ఆయుధాలు పంపారని ఆరోపించారు. అమెరికా వద్ద నిల్వలు భారీ విజయాలు అందుకునే అంతగా ఉన్నాయని ట్రంప్ ఈ సందర్భంగా వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్త్రీ శక్తితో తగ్గిన రోడ్డు ప్రమాదాలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
విద్యుత్ సంస్థలకు అభినందనలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Read Latest InterNational News And Telugu News