Share News

స్త్రీ శక్తితో తగ్గిన రోడ్డు ప్రమాదాలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Mar 03 , 2026 | 05:12 PM

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలను దశల వారీగా ప్రవేశపెట్టి.. అమలు చేస్తోంది. అందులో ఒక్కటి స్త్రీ శక్తి పథకం. ఈ పథకంలో భాగంగా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం కల్పించారు.

స్త్రీ శక్తితో తగ్గిన రోడ్డు ప్రమాదాలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

అమరావతి, మార్చి 03: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలను దశల వారీగా ప్రవేశపెట్టి.. అమలు చేస్తోంది. అందులో ఒక్కటి స్త్రీ శక్తి పథకం. ఈ పథకంలో భాగంగా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం కల్పించారు. ఈ పథకంతో రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతున్నాయి.


ఈ మేరకు ప్రకాశం జిల్లా పోలీసుల అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షను వర్చువల్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య జిల్లాలో గణనీయంగా తగ్గిందంటూ సీఎం చంద్రబాబు దృష్టికి జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు తీసుకెళ్లారు.


స్త్రీ శక్తి పథకం అమలుకు ఆరు నెలల ముందు, తర్వాత పోల్చుకుంటే..19 శాతం మేర మరణాలు తగ్గినట్టు ఈ జిల్లా పోలీసులు ఇచ్చిన నివేదికలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహా అధ్యయనం చేయించాలంటూ ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. గతంతో పోల్చుకుంటే ప్రకాశం జిల్లాలో10 శాతం మేర మరణాలు తగ్గినట్టు నివేదికలో వెల్లడించారు. దాంతో రోడ్డు ప్రమాదాలపై రాష్ట్రవ్యాప్తంగా అధ్యయనం చేయాలంటూ ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యుత్ సంస్థలకు అభినందనలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం.. స్పందించిన ఫ్రాన్స్

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 03 , 2026 | 06:14 PM