విద్యుత్ సంస్థలకు అభినందనలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ABN , Publish Date - Mar 03 , 2026 | 04:44 PM
వేసవి కాలం నేపథ్యంలో విద్యుత్ వినియోగం గరిష్ఠంగా ఉంటుందని.. అందుకు తగిన అవసరాల కోసం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
హైదరాబాద్, మార్చి 03: 18,139 మెగావాట్ల డిమాండ్‌ను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్‌ను నమోదు చేసుకుందన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వేసవి కాలం నేపథ్యంలో విద్యుత్ వినియోగం గరిష్ఠంగా ఉంటుందని.. అందుకు తగిన అవసరాల కోసం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ ఉంటుందన్నారు. అందుకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు.
కోతలు లేకుండా.. ఎటువంటి అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా విద్యుత్ సంస్థలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. పెద్ద రాష్ట్రాలతో సమానంగా తెలంగాణ రికార్డు సృష్టించిందని వివరించారు. ఉదయం 8.00 గంటలకే నింగిలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నానానికి సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. దీంతో ఇళ్లలోనే ప్రజలు ఉండి పోతున్నారు. ఏసీలు, ఫ్రిజ్‌లు ఆన్ చేసి.. ఉంచుతున్నారు. దాంతో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం.. స్పందించిన ఫ్రాన్స్
సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ
Read Latest Telangana News And Telugu News