లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి
ABN , Publish Date - Mar 03 , 2026 | 10:28 AM
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. తాజాగా.. లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో పీఐజే(పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్) కమాండర్ అబూ హమ్‌జా మృతి చెందినట్టు తెలుస్తోంది. హమ్‌జాను మట్టుబెట్టిన విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం అధికారికంగా వెల్లడించింది.
బీరుట్ దక్షిణ శివారు ప్రాంతంలోని హిజ్‌బొల్లా అనుబంధ అల్-మనార్ ప్రధాన కార్యాలయమే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేపట్టింది. ఇజ్రాయెల్ రక్షణ దళాలు హెచ్చరికలు జారీ చేసిన కొద్దిసేపటికే ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది.
ఇవీ చదవండి:
స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
మీ తెలివికి ఛాలెంజ్.. ఈ ఫొటోలో ఉన్న మూడు తప్పులను 10 సెకెన్లలో పట్టుకోండి..