స్పోర్ట్స్ బైక్ మోజు.. ఇంటర్ విద్యార్థి మృతి
ABN , Publish Date - Mar 03 , 2026 | 01:29 PM
నాగోల్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ఇంటర్ విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.
హైదరాబాద్, మార్చి 3: స్పోర్ట్స్ బైక్‌పై మోజు ఓ ఇంటర్ విద్యార్థి ప్రాణాలు తీసింది. నాగోల్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇంటర్ పరీక్షలు రాస్తున్న ఇద్దరు స్నేహితుల సరదా బైక్ రైడ్ విషాదంగా ముగిసింది. స్పోర్ట్స్ బైక్‌పై వేగంగా వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. మృతుడు విష్ణువర్ధన్, గాయపడిన విద్యార్థి ఉషాకిరణ్ (16)గా గుర్తించారు.
విద్యార్థులిద్దరూ కొత్తపేటలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. నిన్న(సోమవారం) మ్యాథ్స్ పరీక్ష రాసిన అనంతరం ఎన్జీవోస్ కాలనీ నుంచి కేటీఎం స్పోర్ట్స్ బైక్ (TS 07 HL 1122)ను అద్దెకు తీసుకున్న ఉషాకిరణ్ (16).. దానిపై రైడింగ్ చేయగా, విష్ణువర్ధన్ వెనక కూర్చున్నట్లు తెలుస్తోంది. ఫొటో సెషన్ కోసం శివారులో రైడ్ చేస్తూ అతివేగంతో వెళ్తున్న సమయంలో బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. విష్ణువర్ధన్ తలకు బలమైన గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఉషాకిరణ్‌కు కాలు, చేయి విరిగినట్లు తెలుస్తోంది.
నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫత్తుల్లాగూడ 100 ఫీట్ రోడ్డులో ఈ దుర్ఘటన జరిగింది. ఇదే సమయంలో వారి మరో స్నేహితుడు మణిదీప్ ఫోన్ చేయడంతో ప్రమాద విషయం వెలుగులోకి వచ్చింది. నాగోల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విష్ణువర్ధన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అలాగే గాయపడిన ఉషాకిరణ్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి...
సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ.. ఏం చెప్పారంటే
అర్ధరాత్రి నడిరోడ్డుపై చిక్కుకుపోయిన హైదరాబాదీలు.. ఏం జరిగిందంటే
Read Latest Telangana News And Telugu News