Share News

అర్ధరాత్రి నడిరోడ్డుపై చిక్కుకుపోయిన హైదరాబాదీలు.. ఏం జరిగిందంటే

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:48 PM

వారణాసి నుంచి హైదరాబాద్‌ వస్తున్న 15 మంది ప్రయాణికులు మహారాష్ట్రలో ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం వల్ల ప్రయాణికులు అర్ధరాత్రి నడిరోడ్డుపై ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అర్ధరాత్రి నడిరోడ్డుపై చిక్కుకుపోయిన హైదరాబాదీలు.. ఏం జరిగిందంటే
Hyderabad Travelers

హైదరాబాద్, మార్చి 3: ప్రైవేటు ట్రావెల్స్ నిర్లక్ష్యం వల్ల దాదాపు 15 మంది హైదరాబాదీలు అర్ధరాత్రి రోడ్డుపై ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. వారణాసి నుంచి హైదరాబాద్‌కు ట్రావెల్స్ బస్సులో ప్రయాణం చేస్తున్న 15 మంది హైదరాబాద్ వాసులు మహారాష్ట్ర.. నాగ్‌పూర్‌లో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల వీరు అర్ధరాత్రి వేళ రోడ్డుపై చిక్కుకుపోయారు. వారణాసి నుంచి హైదరాబాద్‌కు టికెట్లు బుక్ చేసుకున్న15 మంది.. బస్సులో ప్రయాణిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో బస్సు నాగ్‌పూర్‌కు చేరుకున్నాక డ్రైవర్ బస్సును ఆపేశాడు. మరో బస్సు వస్తుందని చెప్పి.. వారిని రోడ్డుపై దించేసి వెళ్లిపోయాడు.


దీంతో 15 మంది ప్రయాణికులు అర్ధరాత్రి సమయంలో రోడ్డుపైనే ఉండిపోయారు. ట్రావెల్స్ యాజమాన్యాన్ని ప్రయాణికులు సంప్రదించగా వారు నిర్లక్ష్యంగా సమాధానాలిచ్చారు. ‘డబ్బులు వాపసు ఇచ్చేస్తాము’ అంటూ బదులిచ్చారు. ఈ ఘటనతో తీవ్రంగా ఇబ్బంది పడిన ప్రయాణికులు.. నాగ్‌పూర్‌లోని గణేశ్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ట్రావెల్స్ యాజమాన్యం తీరుపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

బాధ్యతగా వన్యప్రాణి సంరక్షణ: డిప్యూటీ సీఎం పవన్

సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ.. ఏం చెప్పారంటే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 03 , 2026 | 02:02 PM