ఇక్కడ మేమంతా క్షేమం..!
ABN , Publish Date - Mar 03 , 2026 | 11:54 AM
బతుకుదెరువు కోసం కదిరి ప్రాంతం నుంచి వందలాది మంది గల్ఫ్ దేశాలకు వలస కార్మికులుగా వెళ్లారు. ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు వెళ్లిన కదిరి వాసుల కుటుంబికులు ఆందోళన చెందుతున్నారు.
కువైట్ నుంచి కదిరివాసులు
అయినా ఆందోళనలో కుటుంబ సభ్యులు
కదిరి(అనంతపురం): బతుకుదెరువు కోసం కదిరి ప్రాంతం నుంచి వందలాది మంది గల్ఫ్ దేశాలకు వలస కార్మికులుగా వెళ్లారు. ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు వెళ్లిన కదిరి వాసుల కుటుంబికులు ఆందోళన చెందుతున్నారు. కదిరి నియోజకవర్గం నుంచి దాదాపు వంద మందికి పైగా గల్ఫ్ దేశాలకు వెళ్లారు. కువైట్, ఖతార్, రాఫల్‌కైమా తదితర దేశాల్లో డ్రైవర్లు, ఇతర వృత్తి నిపుణులుగా పనిచేస్తున్నారు.
కదిరి(Kadiri) వలీసాబ్‌రోడ్డుకు చెందిన రిహాన్ మాట్లాడుతూ.. తమకు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని, తాను ఓ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నానని తెలిపాడు. పనులు సర్వసాధారణంగా చేసుకుంటున్నామని, వాహనాలు యధావిధిగా నడుస్తున్నాయని వివరించాడు. తమ గురించి కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని చెప్పాడు.
అయితే కదిరిలోని కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. యుద్ధం వార్తలు చూసి తమ వారు ఎలా ఉన్నారని ఫోన్ల ద్వారా క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు. ఇప్పటి వరకు అధికారికంగా కూడా గల్ప్‌దేశాల నుంచి సహాయం కోసం ఎవరూ అర్థించలేదని ఇన్‌చార్జ్ తహసీల్దార్ రెడ్డిశేఖర్ తెలిపారు. స్థానిక పోలీసులు కూడా ఇదే విషాయాన్ని చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News