ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Mar 15 , 2026 | 07:07 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Mar 15, 2026 21:36 IST
అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం ఏర్పాటు
58 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు
రేపు పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ
అమరావతిలో విగ్రహం ఆవిష్కరించనున్న సీఎం చంద్రబాబు
ఉ.11:15కు శాఖమూరు పార్క్ దగ్గర పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కరణ
విజయవాడలో ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్‌విందులో పాల్గొననున్న సీఎం
సా.5:40కు ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందులో పాల్గొననున్న చంద్రబాబు
-
Mar 15, 2026 21:14 IST
హైదరాబాద్: గోల్కొండ రిసాలబజార్‌లో దారుణం
భర్తతో గొడవపడి 14 నెలల పాపను చంపిన తల్లి గౌసియా బేగం
రంజాన్‌కు కొత్త దుస్తుల విషయంలో దంపతుల మధ్య ఘర్షణ
ఆవేశంలో 14 నెలల కుమార్తెను దిండుతో అదిమిచంపిన తల్లి
-
Mar 15, 2026 21:01 IST
అమరావతి: ఏపీలో వంటగ్యాస్ సరఫరాపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్పందన
వంట గ్యాస్ కొరత లేదు: ఏపీ పౌరసరఫరాల శాఖ కమిషనర్ సౌరవ్ గౌర్
వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: సౌరవ్ గౌర్
అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం: సౌరవ్ గౌర్
-
Mar 15, 2026 19:36 IST
కేసీఆర్ అసెంబ్లీకి రావాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
తెలంగాణ ప్రజల తరఫున కేసీఆర్‌కు విజ్ఞప్తి: మంత్రి కోమటిరెడ్డి
కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి: మంత్రి
గత అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు: మంత్రి
ఈ సారైనా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నా: మంత్రి
-
Mar 15, 2026 19:13 IST
తెలంగాణ: అంగన్వాడీ కేంద్రాల్లో ఒంటిపూట బడులు
ఏప్రిల్ 23 వరకు అంగన్వాడీ కేంద్రాలకు ఒంటిపూట బడులు
ఎండల తీవ్రత దృష్ట్యా అంగన్వాడీ కేంద్రాల సమయాల్లో మార్పు
ప్రభుత్వ పాఠశాలల తరహాలో అంగన్వాడీ కేంద్రాల అమలు
సోమవారం అంగన్వాడీలకు సంబంధించిన ఉత్తర్వుల విడుదల
-
Mar 15, 2026 19:02 IST
తమిళనాడు ప్రభుత్వ కార్యాలయాల్లో మార్పులు
ఎన్నికల ప్రకటనతో కోడ్ అమల్లోకి రావడంతో చర్యలు
తమిళనాడు సెక్రటేరియట్‌లో ప్రదర్శించిన...
DMK ప్రభుత్వ పథకాల ఫొటోలు, పోస్టర్ల తొలగింపు
-
Mar 15, 2026 19:00 IST
తెలంగాణలో ఈ నెల 22న రైతు భరోసా మొదటి విడత నిధులు
సిద్దిపేట జిల్లా నర్మెట్టలో విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
తొలి విడతగా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,590 కోట్ల నిధుల విడుదల
20 రోజుల తర్వాత రైతు భరోసా రెండో విడత నిధులు
రెండో విడతలో రూ.2,650 కోట్ల నిధుల విడుదల
ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత నిధుల విడుదల
మూడు విడతల్లో మొత్తం రూ.9 వేల కోట్ల నిధులు
-
Mar 15, 2026 18:42 IST
పల్నాడు: దొడ్లేరు సచివాలయంలో యువకుడి వీరంగం
మద్యం మత్తులో ఉద్యోగి ఉమామహేశ్వరావుపై ఆలేటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి దాడి
ల్యాప్‌టాప్, ఫర్నిచర్ ధ్వంసం చేసి విసిరేసిన యువకుడు
యువకుణ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Mar 15, 2026 18:34 IST
హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం ఇఫ్తార్ విందు
ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు(దావత్-ఎ-ఇఫ్తార్)
-
Mar 15, 2026 18:32 IST
అమరావతి: కావూరి కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు పరామర్శ
హైదరాబాద్‌లో కావూరు సాంబశివరావు నివాసానికి వెళ్లిన చంద్రబాబు
కావూరు సాంబశివరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు
ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన కేంద్ర మాజీ మంత్రి సాంబశివరావు
-
Mar 15, 2026 18:27 IST
అమరావతి: ఉత్తరాంధ్ర జిల్లాలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్
ఏపీలో రానున్న మూడురోజులు ఓవైపు ఎండలు,..
మరోవైపు మేఘావృతమై విభిన్న వాతావరణమని వెల్లడి
పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన, మోస్తరు వర్షాలు
-
Mar 15, 2026 18:18 IST
ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌పై టీడీపీ అధిష్ఠానం ఆగ్రహం
మొయినాబాద్‌లో BRS మాజీ MLAతో డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన మహేశ్ యాదవ్
మహేశ్ యాదవ్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశం
ఎంపీ మహేశ్ యాదవ్‌కు టీడీపీ అధిష్ఠానం షోకాజ్ నోటీస్
విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్‌కు ఆదేశాలు
డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడటంపై టీడీపీ హైకమాండ్ సీరియస్
-
Mar 15, 2026 18:13 IST
డ్రగ్స్ వ్యవహారంపై కేటీఆర్ ఘాటు స్పందన
డ్రగ్స్ వాడకం, విక్రయాలను బీఆర్ఎస్ ఖండిస్తోంది: కేటీఆర్
మాదకద్రవ్యాలు మనుషులను రాక్షసులుగా మారుస్తాయి: కేటీఆర్
డ్రగ్స్ కేసులను అడ్డం పెట్టుకుని నాపై దుష్ప్రచారం చేశారు: కేటీఆర్
-
Mar 15, 2026 17:54 IST
బహ్రెయిన్, సౌదీ ఫార్ములా-1 ఈవెంట్స్ రద్దు
ఇరాన్ యుద్ధంతో ఫార్ములా-1 షెడ్యూల్‌కు ఆటంకాలు
ఏప్రిల్‌లో జరగాల్సిన బహ్రెయిన్, సౌదీ ఫార్ములా-1 రేసులు రద్దు
ఏకంగా రెండు ఈవెంట్స్ రద్దుతో ఫార్ముల్-1 షెడ్యూల్‌పై ప్రభావం
-
Mar 15, 2026 17:52 IST
కేరళలో గ్యాంగ్‌స్టర్ దారుణ హత్య
వేట కొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు
సీసీటీవీ కెమెరాలో రికార్డు అయిన దాడి దృశ్యాలు
-
Mar 15, 2026 17:35 IST
సల్మాన్ రనౌట్‌పై ట్రాఫిక్ పోలీసుల సెటైర్
ట్రాఫిక్ రూల్స్ అవగాహన కోసం ఈ రనౌట్‌ను వాడిన పోలీసులు
రోడ్డపై మిరాజ్-సల్మాన్ ఉన్న ఫొటోను షేర్ చేసిన పోలీసులు
-
Mar 15, 2026 16:35 IST
4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలితప్రాంతంలో ఎన్నికలు.. పోలింగ్ తేదీలు
కేరళంలో ఏప్రిల్ 9న పోలింగ్
తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్
అస్సాంలో ఏప్రిల్ 9న పోలింగ్
పశ్చిమబెంగాల్‌లో రెండు దశల్లో పోలింగ్
బెంగాల్‌లో ఏప్రిల్ 23న తొలిదశ పోలింగ్
బెంగాల్‌లో ఏప్రిల్ 29న రెండోదశ పోలింగ్
పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న పోలింగ్
మే 4న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు
మహారాష్ట్ర, గోవా, గుజరాత్, కర్ణాటక, త్రిపుర, నాగాలాండ్‌లోని..
8 అసెంబ్లీ నియోజకవర్గాలకూ ఉప ఎన్నికలు
-
Mar 15, 2026 16:12 IST
4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటన
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన CEC
5 రాష్ట్రాల్లో 17.4 కోట్ల మంది ఓటర్లు: CEC
SIRను సమర్థవంతంగా నిర్వహించాం: CEC
పారదర్శకంగా పోలింగ్ కోసమే SIR: CEC
ఓటింగ్‌లో యువత చురుగ్గా పాల్గొనాలి: CEC
అన్ని పోలింగ్ స్టేషన్లలో 100 శాతం వెబ్‌క్యాస్టింగ్: CEC
-
Mar 15, 2026 16:05 IST
ఏలూరు: కైకలూరులో ఆర్యవైశ్య కళ్యాణ మండపం ప్రారంభించిన మంత్రి టీజీ భరత్
రూ.5 కోట్లతో ఆర్యవైశ్య కళ్యాణ మండపాన్ని అద్భుతంగా నిర్మించారు: మంత్రి టీజీ భరత్
ఆర్యవైశ్యుల సేవలు కొనియాడిన మంత్రి టీజీ భరత్
ఏపీ సీఎం చంద్రబాబు ఆర్యవైశ్యులకు గొప్ప గౌరవం ఇచ్చారు: మంత్రి టీజీ భరత్
-
Mar 15, 2026 16:04 IST
అమెరికా, ఇజ్రాయెల్ దేశాల నౌకలనే అడ్డుకుంటాం: ఇరాన్ విదేశాంగ మంత్రి
ఇతర దేశాల నౌకలు స్వేచ్ఛగా హోర్ముజ్ గుండా ప్రయాణించవచ్చు: మంత్రి అబ్బాస్ అరాగ్చీ
మొజ్తాబా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, రాజ్యాంగం ప్రకారం విధులు నిర్వర్తిస్తున్నారని వ్యాఖ్య
-
Mar 15, 2026 15:54 IST
ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్‌పై మాజీ క్రికెటర్ హర్భజన్ కీలక వ్యాఖ్యలు
టాప్ ఆర్డర్‌లో ర్యాన్ రికెల్టన్, డికాక్ ఆడకపోవచ్చు: భజ్జీ
ముంబై జట్టులో స్థానిక ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు: భజ్జీ
అఫ్గానిస్థాన్ స్పిన్నర్ అల్లా గజన్‌ఫర్ తుది జట్టులో ఉండొచ్చు: భజ్జీ
-
Mar 15, 2026 15:42 IST
హన్మకొండ: హయగ్రీవచారి మైదానంలో హమాలీల మహాగర్జన సభ
హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ..
హయగ్రీవచారి మైదానంలో హమాలీల మహాగర్జన సభ
భారీగా హాజరైన హమాలీ కార్మికులు
-
Mar 15, 2026 15:19 IST
నెతన్యాహును వెంటాడి చంపుతాం: ఇరాన్
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూకు ఇరాన్ మిలిటరీ హెచ్చరిక
ఆయన బతికున్నట్టైతే వెంటాడి చంపుతామని వార్నింగ్
వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన ఇరాన్
-
Mar 15, 2026 15:01 IST
ఇరాన్‌లోని అత్యంత కీలకమైన అణు కేంద్ర నగరం ఇస్ఫహాన్‌పై భీకర దాడులు
తక్కువ ఎత్తులో ఎగురుతూ దాడులు చేసిన అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు
పశ్చిమ టెహ్రాన్‌లో ఉన్న స్పేస్ రీసెర్చ్ సెంటర్‌పైనా దాడులు
ఇరాన్‌పై దాడుల కోసం రంగంలోకి అమెరికా బి-52 బాంబర్
-
Mar 15, 2026 14:21 IST
నెల్లూరు రూరల్ అభివృద్ధికి రూ.2 కోట్లతో పనులకు శ్రీకారం
నెల్లూరు రూరల్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, సోమిరెడ్డి
కోటంరెడ్డి స్పీడ్ చూసి మేమూ నేర్చుకోవాలి: ఎమ్మెల్యే సోమిరెడ్డి
వైసీపీ హయాంలో కోట్లాది రూపాయల బిల్లుల దోపిడీ: సోమిరెడ్డి
-
Mar 15, 2026 13:22 IST
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు
పాజిటివ్ వచ్చిన నలుగురికి నోటీసులు ఇవ్వనున్న పోలీసులు
నెగిటివ్ వచ్చిన వారిని వదిలిపెట్టే అవకాశం
-
Mar 15, 2026 13:20 IST
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కామెంట్స్
సీఎం రేవంత్, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై కవిత ఫైర్
ప్రపంచ బ్యాంక్‌కు మూసీ పరివాహక భూములు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు: కవిత
ఇప్పటివరకూ మూసీపై డీపీఆర్‌ను ప్రభుత్వం ఎందుకు రిలీజ్ చేయలేదు: కవిత
-
Mar 15, 2026 13:17 IST
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
రేపు ఉ.11:45 గంటలకు గవర్నర్ శివప్రతాప్ ప్రసంగం
రేపు అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
తొలిసారి అసెంబ్లీకి రానున్న కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా
పది రోజులు సభ నిర్వహించాలనే యోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం
-
Mar 15, 2026 12:52 IST
డుడుమా జలపాతం అందాలకు ఆనంద్ మహీంద్రా ఫిదా
ఒడిశాలోని డుడుమా జలపాతం వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
భారతదేశ సౌందర్యం అంతులేనిదంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు
కోరాపుట్ జిల్లాలోని మాచ్‌కండ్ నదిపై డుడుమా జలపాతం
పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్న వారికి మహీంద్రా కృతజ్ఞతలు
ఒడిశాలో ఇంకా చూడాల్సిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయన్న ఆనంద్ మహీంద్రా
-
Mar 15, 2026 12:22 IST
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక షాదీముబారక్ అమలు కావడం లేదు: ఎమ్మెల్యే హరీశ్ రావు
ఈ రెండున్నర సంవత్సరాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఒక్క మంచి పనైనా చేశారా?: హరీశ్ రావు
ఒక్క ఇల్లు కట్టలేదు.. కానీ లక్ష ఇండ్లు కూల్చారు: హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డి జూనియర్ యోగి అయిపోయారు: హరీశ్ రావు
-
Mar 15, 2026 12:18 IST
పుకార్లకు ఫుల్‌స్టాఫ్ పెట్టిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరణవార్త కేవలం ఒక పుకారు
అది ఒక'ఫేక్ న్యూస్'.. క్లారిటీ ఇచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం
నెతన్యాహు ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్న ప్రధాని కార్యాలయం
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మెుద్దని విన్నపం
-
Mar 15, 2026 12:16 IST
ఉత్తరాంధ్రలో పర్యటించిన జనసేన ఎమ్మెల్సీ నాగబాబు
విశాఖలో జనసేన ఉద్యమి సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొన్న నాగబాబు
అన్ని విధాలుగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని వెల్లడి
-
Mar 15, 2026 12:12 IST
సీబీఎస్ఈ కీలక నిర్ణయం
గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు రద్దు చేసిన సీబీఎస్ఈ
మార్చి 16 నుంచి ఏప్రిల్ 10 వరకు పరీక్షలు జరగనున్నట్లు గతంలో ప్రకటన
తాజాగా ఆ షెడ్యూల్‌ను రద్దు చేస్తూ నిర్ణయం
-
Mar 15, 2026 12:11 IST
సన్‌రైజర్స్ జట్టుకు పాక్ ప్లేయర్ అబ్రార్ దూరం?
‘ది హండ్రెడ్ లీగ్’: సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ అబ్రార్‌ను కొనుగోలు చేయడంపై విమర్శలు
ఈ సీజన్‌లో అతడు ఆడే అవకాశాలు లేవంటూ క్రికెట్ వర్గాల్లో చర్చ
పాక్-విండీస్ మధ్య టెస్టు సిరీసే కారణమంటూ వార్తలు
-
Mar 15, 2026 12:07 IST
మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు
ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా డ్రగ్స్ తీసుకుంటే చర్యలు తప్పవు: ఎస్పీ గిరిధర్
డ్రగ్స్ పార్టీ సమాచారం తెలుసుకునే అక్కడికి వెళ్లాం: ఎస్పీ గిరిధర్
11 మందికి టెస్టులు చేశాం: ఈగల్ ఎస్పీ గిరిధర్
డ్రగ్స్ టెస్టులో ఆరుగురికి పాజిటివ్: ఎస్పీ గిరిధర్
-
Mar 15, 2026 10:55 IST
మొయినాబాద్: రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో పోలీసుల సోదాలు
పార్టీ జరుగుతుండగా డ్రగ్స్, మద్యం వినియోగించినట్లు గుర్తింపు
పోలీసులపై ఫామ్‌హౌస్ నుంచి కాల్పులు జరిపినట్లు ఫిర్యాదు
మెుయినాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన SI నయిమ్ ఉద్దీన్
జర్మనీకి చెందిన 32 రివాల్వర్ స్వాధీనం
ఒక లైవ్ రౌండ్, నాలుగు ఖాళీ కార్ట్రిడ్జ్‌లు సీజ్
పార్టీలో 10 మంది పురుషులు, మహిళ ఉన్నట్లు గుర్తించిన ఎస్ఐ
-
Mar 15, 2026 10:21 IST
కాకినాడ జిల్లా: ప్రత్తిపాడు నియోజకవర్గంలో పెద్దపులి కలకలం
గత 16 రోజులుగా పలు గ్రామాల్లో సంచరిస్తున్న పెద్దపులి
అటవీ శాఖ అధికారులకు సవాల్‌గా మారిన పులి
పులిని పట్టుకునేందుకు ఇప్పటివరకూ చేసిన ప్రయత్నాలు విఫలం
-
Mar 15, 2026 09:53 IST
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో దారుణం
కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక నలుగురి మృతి
మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తింపు
మృతుల్లో ముగ్గురు చిన్నారులు, కేసు నమోదు
-
Mar 15, 2026 09:51 IST
అసోం ఎన్నికలు 2026: కాంగ్రెస్ రెండో జాబితా విడుదల!
23 మంది అభ్యర్థులతో రెండో జాబితా రిలీజ్ చేసిన అసోం కాంగ్రెస్
ఇప్పటివరకూ మొత్తం 65 మంది అభ్యర్థుల ఖరారు
మండియా నుంచి మాజీ ఎంపీ అబ్దుల్ ఖాలీక్ పోటీ
మిత్రపక్షాల కోసం 15 అసెంబ్లీ స్థానాల కేటాయింపు
-
Mar 15, 2026 09:47 IST
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో నేపాల్ గ్యాంగ్ భారీ చోరీ
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీకి పాల్పడిన నేపాల్‌కు చెందిన దంపతులు
రూ.2కోట్ల విలువైన వజ్రాభరణాలు, రోలెక్స్ వాచీలు చోరీ
45 రోజుల క్రితమే వ్యాపారి ఇంట్లో పనిలో చేరిన దంపతులు
-
Mar 15, 2026 08:46 IST
నేడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్యంతర ఎన్నికలు
బరిలో హరినారాయణ, ఆగంరావు, బాబురావు అనిల్
ప్లేయర్ల కోటాలో ఓటు వేయనున్న..
వీవీఎస్ లక్ష్మణ్, మిథాలీరాజ్, వెంకటపతిరాజు, తదితరులు
సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభం
-
Mar 15, 2026 08:39 IST
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో గుడ్ న్యూస్
హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిన మన ఎల్‌పీజీ నౌకలు!
పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి భారత్‌కు వంటగ్యాస్ తీసుకువస్తున్న నౌకలు
జలసంధిని దాటిన 'సిగ్మా గ్యాస్', 'ఎపిక్ బెర్ముడా' అనే రెండు భారీ ఎల్‌పీజీ క్యారియర్లు
నిరంతరం నౌకల భద్రతను పర్యవేక్షిస్తోన్న భారత నౌకాదళం
-
Mar 15, 2026 08:27 IST
రోహిత్ శర్మ బాటలో సూపర్ ఫిట్‌గా మారిన రిషబ్ పంత్
ఐపీఎల్ 2026కు ముందు సూపర్ ఫిట్‌గా మారిన రిషబ్ పంత్
ఐదు నెలలుగా జిమ్‌లో శ్రమించి బాగా బరువు తగ్గిన పంత్
లఖ్‌నవూ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పంత్
-
Mar 15, 2026 08:10 IST
యాదాద్రి: భువనగిరి మండలం తొక్కాపురంలో విషాదం
మతిస్తిమితం లేక కూతురు, కొడుకుపై కత్తితో దాడి చేసి ఉరివేసుకుని తల్లి ఆత్మహత్యాయత్నం
కూతురు కృతిక(14) మృతి, తల్లి దాడి నుంచి తప్పించుకున్న కుమారుడు
-
Mar 15, 2026 07:11 IST
కేకేఆర్ తప్పు చేసింది: అనిల్ కుంబ్లే
శ్రేయస్ అయ్యర్, ఫిల్ సాల్ట్‌లను వదులుకోవడం కేకేఆర్ చేసిన తప్పు: అనిల్ కుంబ్లే
ఐపీఎల్ టైటిల్‌కు కేకేఆర్ గట్టి పోటీదారుగా ఉండలేదు: అనిల్ కుంబ్లే
-
Mar 15, 2026 07:10 IST
జట్టులో అతడే సూపర్ స్టార్: సంజు శాంసన్
తమ ఓపెనింగ్ జోడీపై సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
మేమిద్దరం బరిలోకి దిగితే అగ్గికి అగ్గి తోడైనట్లే: సంజు
ఐసీసీ ట్రోఫీలను గెలవడమే నా గోల్: అభిషేక్ శర్మ
-
Mar 15, 2026 07:08 IST
నేడు ఢిల్లీలో నమన్ అవార్డుల ప్రదానం
రాహుల్ ద్రవిడ్, రోజర్ బిన్నీ, మిథాలీ రాజ్‌కు..
లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు అందజేయనున్న BCCI
-
Mar 15, 2026 07:08 IST
దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధరలు..
హైదరాబాద్: రూ.1,46,350(22 క్యారెట్), రూ.1,59,660(24 క్యారెట్)
విజయవాడ: రూ.1,46,350(22 క్యారెట్), రూ.1,59,660(24 క్యారెట్)
ఢిల్లీ: రూ.1,46,500(22 క్యారెట్), రూ.1,59,810(24 క్యారెట్)
-
Mar 15, 2026 07:08 IST
నేటి నుంచి ఆకాశ ఎయిర్‌లైన్స్ సర్‌ఛార్జీల పెంపు
టికెట్ ధరలపై రూ.199 నుంచి రూ.1,300వరకు సర్‌ఛార్జ్
ఇప్పటికే విమాన టికెట్ ధరలను పెంచిన ఇండిగో
-
Mar 15, 2026 07:07 IST
రేపు అమరావతిలో పొట్టి శ్రీరాముల విగ్రహావిష్కరణ
పొట్టి శ్రీరాముల 125వ జయంతి సందర్భంగా..
58 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ మహోత్సవం
పొట్టి శ్రీరాముల ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమం