Share News

రాజకీయాల కోసం డ్రగ్స్ కేసులా? రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్

ABN , Publish Date - Mar 15 , 2026 | 07:11 PM

తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోన్న డ్రగ్స్ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. డ్రగ్స్ మహమ్మారిపై తన నిబద్ధతను చాటుతూనే.. ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజకీయాల కోసం డ్రగ్స్ కేసులా? రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
Telangana Drugs Case

హైదరాబాద్, మార్చి15: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో డ్రగ్స్ పార్టీ తీవ్ర కలకలం సృష్టించింది. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. డ్రగ్స్ మహమ్మారిపై తన నిబద్ధతను చాటుతూనే.. ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.


డ్రగ్స్ కేసుపై కేటీఆర్ మాట్లాడుతూ.. ‘మాదక ద్రవ్యాలు మనుషులను రాక్షసులుగా మారుస్తాయి. సమాజానికి ఇవి పెను ముప్పు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా ఇలాంటి వ్యసనాలకు పాల్పడటం దురదృష్టకరం. డ్రగ్స్ వాడకాన్ని, విక్రయాలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ విషయంలో మాకు ఎలాంటి రాజీ లేదు. డ్రగ్స్ కేసులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీపై దుష్ప్రచారం జరుగుతోంది. ఈ అంశంలో నీచమైన రాజకీయాల కోసం బీఆర్ఎస్ పార్టీని లాగుతున్నారు. నాపై అసత్య ప్రచారాలు చేసేవారికి చట్టపరమైన నోటీసులు ఇస్తాను. నేను ఏ పరిక్షకైనా సిద్దం. గతంలోనూ ఇదే విషయం చెప్పాను. డ్రగ్స్ వాడుతున్న వారు లేదా విక్రయిస్తున్న వారెవరైనా సరే.. అలాంటివారికి రాజకీయ నేపథ్యంతో సంబంధం లేకుండా చట్టప్రకారం కఠినంగా శిక్షించాలి’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి:

ఫోన్ నెంబర్ తీసుకుని వ్యక్తి దారుణం.. అసభ్య మెసేజ్‌లు పంపుతూ..

న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా సూపర్ విక్టరీ

Updated Date - Mar 15 , 2026 | 07:27 PM