Share News

న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా సూపర్ విక్టరీ

ABN , Publish Date - Mar 15 , 2026 | 05:46 PM

న్యూజిలాండ్‌ పర్యటనను దక్షిణాఫ్రికా గెలుపుతో ఆరంభించింది. మౌంట్ మంగునూయ్ వేదికగా జరిగిన తొలి టీ20లో కివీస్‌పై 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ప్రోటీస్‌ జట్టు 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా సూపర్ విక్టరీ
South Africa vs New Zealand

స్పోర్ట్స్ డెస్క్: న్యూజిలాండ్‌ పర్యటనను దక్షిణాఫ్రికా గెలుపుతో ఆరంభించింది. మౌంట్ మంగునూయ్ వేదికగా జరిగిన తొలి టీ20లో కివీస్‌పై 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ప్రోటీస్‌ జట్టు 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్‌ చేసింది. సఫారీ బౌలర్ల ధాటికి 14.3 ఓవర్లలో కేవలం 91 పరుగులకే కివీస్ జట్టు కుప్పకూలింది.


న్యూజిలాండ్ బ్యాటర్లలో నీషమ్‌(26) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి కివీస్ బ్యాటర్లు విలవిల్లాడారు. ప్రోటీస్‌ బౌలర్లలో న్కోబాని మోకోనా మూడు వికెట్లు సాధించాడు. కోయిట్జీ, బార్ట్‌మన్‌, కేశవ్‌ మహరాజ్‌ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం 92 పరుగుల లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా కూడా తీవ్రంగా శ్రమించింది. న్యూజిలాండ్ కెప్టెన్‌ మిచెల్‌ శాంట్నర్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తూ సఫారీలకు చుక్కలు చూపించాడు.


అయితే ఓపెనర్ కానర్ ఎస్టర్‌హైజెన్(45) అజేయంగా రాణించాడు. ఫలితంగా సౌతాఫ్రికా16.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్‌లో మార్‌క్రమ్‌, డికాక్‌, రబాడ, ఎంగిడి వంటి సీనియర్లు లేనప్పటికీ.. కేశవ్‌ మహరాజ్‌ సారథ్యంలో ప్రోటీస్‌ యువ జట్టు అద్భుతంగా రాణించింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 హామిల్టన్ వేదికగా మార్చి 17న జరగనుంది.


ఇవి కూడా చదవండి:

ఆ ఇద్దరు టాప్ ఆర్డర్‌లో ఆడటం కష్టం.. ముంబై జట్టుపై హర్భజన్ కీలక వ్యాఖ్యలు

భారత్ వరుసగా అద్భుతాలు సాధించడం గర్వంగా ఉంది: రోహిత్ శర్మ

Updated Date - Mar 15 , 2026 | 05:55 PM