Share News

ఆ ఇద్దరు టాప్ ఆర్డర్‌లో ఆడటం కష్టం.. ముంబై జట్టుపై హర్భజన్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 15 , 2026 | 03:21 PM

ఐపీఎల్ 2026 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ కు సంబంధించిన విషయాల కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముంబై ఇండియన్స్ పై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు.

ఆ ఇద్దరు టాప్ ఆర్డర్‌లో ఆడటం కష్టం.. ముంబై జట్టుపై హర్భజన్ కీలక వ్యాఖ్యలు
Harbhajan Singh IPL 2026 comments

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 28 నుంచి ఈ రిచ్ లీగ్ షురు కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌కు సంబంధించిన విషయాల కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలానే పలువురు మాజీ క్రికెటర్లు ఈ లీగ్‌లోని పలు జట్లపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డికాక్ ఇద్దరూ టాప్ ఆర్డర్‌లో ఆడే ఛాన్స్ లేదని అభిప్రాయపడ్డాడు.


ఓ స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న హర్భజన్ సింగ్..ముంబై తుది జట్టుపై తన అభిప్రాయాలను వెల్లడించారు. 'ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డికాక్‌ కలిసి ఆడతారని నేను అనుకోను. ర్యాన్ రికెల్టన్ లేదా డికాక్.. ఇద్దరిలో ఒకరు మాత్రమే తుది జట్టులో ఉంటారని నేను భావిస్తున్నాను. ముంబైలో రోహిత్ శర్మ వంటి స్థానిక ఆటగాళ్లు చాలా మంది ఉన్నందున ఈ ఇద్దరు ఆటగాళ్లను టాప్ ఆర్డర్‌లో ఆడించడం కష్టం. రోహిత్.. ర్యాన్ రికెల్టన్ లేదా డి కాక్ తో ఓపెనింగ్ చేయాల్సి రావచ్చు ' అని హర్భజన్ తెలిపాడు.


ముంబై జట్టు ఫ్రంట్‌లైన్ స్పిన్నర్‌పై కూడా హర్భజన్..తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 'ముంబై ఇండియన్స్ ఫ్రంట్‌లైన్ స్పిన్నర్‌ గా అల్లా గజన్‌ఫర్, మిచెల్ శాంట్నర్‌లలో ఎవరినో ఒకరి ఎంచుకోవలసి ఉంటుంది. నాకు తెలిసినంతవరకు గజన్‌ఫర్.. వేసే బంతులు చాలా వైవిధ్యంగా ఉంటాయి. కాబట్టి, శాంట్నర్ కంటే గజన్‌ఫర్ తుది జట్టులో ఉండే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. అతడు బ్యాటర్లకు పెద్దగా పరిచయం లేదు. ఇదే గజఫర్‌కు సానుకూలమైన అంశం. శాంట్నర్ కొన్ని మ్యాచుల్లో ఆడతాడు' అని హర్భజన్ అభిప్రాయపడ్డాడు.


ఇవి కూడా చదవండి:

భారత్ వరుసగా అద్భుతాలు సాధించడం గర్వంగా ఉంది: రోహిత్ శర్మ

‘సన్‌రైజర్స్’ జట్టుకు పాక్ ప్లేయర్ అబ్రార్ దూరం?

Updated Date - Mar 15 , 2026 | 03:52 PM