‘సన్‌రైజర్స్’ జట్టుకు పాక్ ప్లేయర్ అబ్రార్ దూరం?
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:31 AM
ది హండ్రెడ్ లీగ్‌లో భాగంగా పాకిస్థాన్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు కొనుగోలు చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సీజన్‌లో అబ్రార్ ఆడే అవకాశాలు లేవని క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ది హండ్రెడ్ లీగ్‌లో భాగంగా పాకిస్థాన్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు కొనుగోలు చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యమే దీనికీ ఓనర్. దీంతో పాక్ క్రికెటర్‌ను జట్టులోకి ఎలా తీసుకుంటారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఆర్‌హెచ్ జట్టుకు బాయ్‌కాట్ చేయాలంటూ ట్వీట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సీజన్‌లో అబ్రార్ అహ్మద్ ‘ది హండ్రెడ్ లీగ్’లో ఆడే అవకాశాలు లేవని క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇప్పటి వరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి అబ్రార్‌కు నిరభ్యంతర పత్రం రాలేదు. ఇంగ్లిష్ లీగ్ సమయంలోనే పాక్ జట్టు వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఆడేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. దీంతో జాతీయ జట్టు బాధ్యతల నేపథ్యంలో అబ్రార్‌కు ఎన్‌వోసీ ఇవ్వకూడది పాక్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.
‘ది హండ్రెడ్ లీగ్‌లో అబ్రార్ ఆడకపోవచ్చు. ఆ లీగ్ సమయంలోనే పాక్ రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా విండీస్‌తో తలపడనుంది. వేలంలో పాల్గొంటే భారీ మొత్తం వస్తుంది. అబ్రార్ తరఫున అతడి ఏజెంట్ ది హండ్రెడ్ లీగ్ వేలంలో పేరు నమోదు చేశాడు. పాక్ క్రికెట్ బోర్డు నుంచి ఎన్‌వోసీ వస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. పీసీబీతో అతడికి మంచి రిలేషన్ ఉంది. కానీ అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్ నేపథ్యంలో అబ్రార్ ది హండ్రెడ్ లీగ్‌లో ఆడే అవకాశాలు 50 శాతం మాత్రమే ఉన్నాయి. ఎన్‌వోసీ ఇవ్వకపోతే ఈసారి లీగ్‌లో ఆడే అవకాశం అతడికి ఉండదు’ అని పీసీబీ వర్గాలు తెలిపాయి. కాగా ది హండ్రెడ్ లీగ్ జులై 21 నుంచి ఆగస్టు 16 వరకు జరగనుంది. వెస్టిండీస్ పర్యటనకు పాక్ కూడా జులై 15న వెళ్లనుంది. ఆగస్టు 7 వరకు రెండు టెస్టులు ఆడనుంది.
ఇవి కూడా చదవండి:
రోహిత్ శర్మ బాటలో.. సూపర్ ఫిట్‌గా మారిన రిషబ్ పంత్
ఐపీఎల్ 2026: టైటిల్‌కు కేకేఆర్ గట్టి పోటీదారుగా ఉండలేదు.. అనిల్ కుంబ్లే