Share News

రోహిత్ శర్మ బాటలో.. సూపర్ ఫిట్‌గా మారిన రిషబ్ పంత్

ABN , Publish Date - Mar 15 , 2026 | 08:05 AM

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. దీంతో టీమిండియా స్టార్ బ్యాటర్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తన ఫామ్‌పై దృష్టి పెట్టాడు. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను అనుసరిస్తూ.. సూపర్ ఫిట్‌ అయ్యాడు.

రోహిత్ శర్మ బాటలో.. సూపర్ ఫిట్‌గా మారిన రిషబ్ పంత్
Rishabh Pant

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. దీనివల్ల వైట్ బాల్ ఫార్మాట్‌కు పంత్‌ను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. అయితే మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. దీంతో పంత్ తన ఫామ్‌పై దృష్టి పెట్టాడు. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను అనుసరిస్తూ.. సూపర్ ఫిట్‌ అయ్యాడు.


ఐపీఎల్ 2026కు ముందు పంత్ తన రూపాన్నే మార్చేసుకున్నాడు. గత ఐదు నెలలు జిమ్‌లో శ్రమించి బాగా బరువు తగ్గి మునుపటికంటే సన్నగా తయ్యారయ్యాడు. 2025 ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.27 కోట్లతో పంత్‌ను దక్కించుకున్న లఖ్‌నవూ సూపర్ జెయింట్స్.. జట్టుకు కెప్టెన్‌ను చేసింది. కేఎల్ రాహుల్ స్థానంలో సారథిగా వ్యవహరించిన పంత్.. జట్టును ప్లేఆఫ్స్ చేర్చలేకపోయాడు. ఈ ఏడాది అతడిని ఎల్ఎస్‌జీ అట్టిపెట్టుకుంది. గత కొంత కాలంగా ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్న పంత్.. ఇటీవలే మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో కలిసి ప్రాక్టీస్ చేసిన వీడియోలు నెట్టింట్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. బాగా బరువు తగ్గి సూపర్ ఫిట్ అయిన పంత్.. ఈ సారి ఐపీఎల్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాల్సి ఉంది. కాగా మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభం కానుండగా.. ఎల్‌ఎస్‌జీ తన తొలి మ్యాచ్ మార్చి 5న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.


ఇవి కూడా చదవండి:

పాక్ ఆటగాళ్లకు రూ.50లక్షల జరిమానా.. ఆ వార్తలను ఖండించిన పీసీబీ

పాకిస్థాన్ ప్లేయర్ ప్రపంచ రికార్డ్..

Updated Date - Mar 15 , 2026 | 09:11 AM