Share News

Ban Vs Pak: పాకిస్థాన్ ప్లేయర్ ప్రపంచ రికార్డ్..

ABN , Publish Date - Mar 14 , 2026 | 03:28 PM

బంగ్లాదేశ్‌తో జ‌రిగిన రెండో వ‌న్డేలో 128 ప‌రుగుల తేడాతో పాకిస్థాన్ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ విజ‌యంలో యువ సంచ‌ల‌నం మాజ్ సదాకత్‌ కీల‌క పాత్ర పోషించాడు. అలానే ఓ రికార్డును క్రియేట్ చేశాడు.

Ban Vs Pak: పాకిస్థాన్ ప్లేయర్ ప్రపంచ రికార్డ్..
Maaz Sadaqat record vs Bangladesh

స్పోర్ట్స్ డెస్క్: బంగ్లాదేశ్‌తో జ‌రిగిన రెండో వ‌న్డేలో 128 ప‌రుగుల తేడాతో పాకిస్థాన్(Pakistan) ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో పాక్ సమం చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ యువ ఆటగాడు మాజ్ సదాకత్‌ ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టాడు. తన కెరీర్‌లో రెండో అంత‌ర్జాతీయ మ్యాచ్ ఆడిన స‌దాక‌త్ త‌న అద్భుత ప్రద‌ర్శన‌తో అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు. ఈక్రమంలోనే వెస్టిండీస్ దిగ్గజ ప్లేయర్ క్రిస్ గేల్ రికార్డును మాజ్ బ్రేక్ చేశాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...


ఢాకా వేదికగా జరిగిన రెండో వన్డేలో టాస్ ఓడిన పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగిన స‌దాక‌త్(Maaz Sadaqat ).. బంగ్లా బౌల‌ర్లకు చుక్కలు చూపించాడు. కేవ‌లం 46 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 274 పరుగులకు పాకిస్థాన్ ఆల్ ఔటైంది. బ్యాటింగ్ లో అదరగొట్టిన మాజ్ అనంత‌రం బౌలింగ్‌లో కూడా మూడు వికెట్లు ప‌డ‌గొట్టి ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.


ఈ క్రమంలో బంగ్లాదేశ్‌(Bangladesh)పై వన్డేల్లో అర్ధ సెంచ‌రీతో పాటు మూడు వికెట్లు తీసిన అత్యంత పిన్న వయస్కుడిగా మాజ్ సదాకత్ రికార్డుల‌కెక్కాడు. కేవ‌లం 20 ఏళ్ల 302 రోజుల‌ వ‌య‌స్సులోనే స‌దాక‌త్ ఈ ఫీట్‌ను సాధించాడు. గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్(23 ఏళ్ల 73 రోజులు) పేరిట ఉండేది.

తాజా మ్యాచ్‌తో గేల్‌ రికార్డును స‌దాక‌త్ బ్రేక్ చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో ఒకే వ‌న్డే మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించిన 14వ ఆట‌గాడిగా స‌దాక‌త్ నిలిచాడు. అలానే పాకిస్థాన్ నుంచి మాత్రం ఈ ఫీట్ సాధించిన ఐదో ప్లేయ‌ర్‌గా స‌దాక‌త్ నిలిచాడు. అతడి కంటే ముందు షాహిద్ అఫ్రిది, అబ్దుల్ రజాక్ వంటి దిగ్గజాలు ఉన్నారు.


బంగ్లాపై వన్డేలో 50 పరుగులు చేసి 3 వికెట్లు తీసిన అతి పిన్న వయస్కులు:

  • మాజ్ సదాకత్: 20 ఏళ్ల, 302 రోజులు-75 పరుగులు- 3/23-మీర్పూర్ 2026

  • క్రిస్ గేల్: 23 ఏళ్ల, 73 రోజులు-73 పరుగులు- 3/37-ఢాకా 2002

  • ఎల్టన్ చిగుంబురా: 23 ఏళ్ల, 227 రోజులు- 60 పరుగులు- 3/27-మీర్పూర్ 2009

  • అజ్మతుల్లా ఒమర్జాయ్: 24 ఏళ్ల, 332 రోజులు- 70 పరుగులు- 4/37-షార్జా 2024

  • సోలమన్ మైర్: 25 ఏళ్ల, 99 రోజులు- 52 పరుగులు- 3/49మీర్పూర్ 2014



ఇవి కూడ చదవండి:

వింత రనౌట్.. హెల్మెట్ నేలకేసి కొట్టిన పాక్ ప్లేయర్

ఆ ముగ్గురు క్రికెట్ దిగ్గజాలకు ‘లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డ్’.. ప్రకటించిన బీసీసీఐ

Updated Date - Mar 14 , 2026 | 04:59 PM