భారత్.. రన్నరప్
ABN , Publish Date - Mar 15 , 2026 | 06:15 AM
హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో ఆసాంతం సత్తా చాటిన భారత మహిళల జట్టుకు తుది పోరులో నిరాశ ఎదురైంది. ప్రపం చ ఆరో ర్యాంకర్ ఇంగ్లండ్‌తో శనివారం ఇక్కడ జరిగిన టోర్నీ ఫైనల్లో...
ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి
మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్
హైదరాబాద్: హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో ఆసాంతం సత్తా చాటిన భారత మహిళల జట్టుకు తుది పోరులో నిరాశ ఎదురైంది. ప్రపం చ ఆరో ర్యాంకర్ ఇంగ్లండ్‌తో శనివారం ఇక్కడ జరిగిన టోర్నీ ఫైనల్లో సలీమా టేటె సారథ్యంలోని మన జట్టు 2-0తో ఓటమిపాలై రన్నర్‌పతో సరిపెట్టుకుంది. గ్రేస్ (13వ నిమిషం), ఎలిజబెత్ (43వ) ఇంగ్లండ్ తరపున గోల్స్ చేశారు. అయితే క్వాలిఫయర్స్‌లో సెమీఫైనల్‌కు చేరడం ద్వారా భారత్ ప్రపంచ కప్‌కు ఇప్పటికే అర్హత సాధించిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ టోర్నీ వచ్చే ఆగస్టు 14 నుంచి 30 వరకు బెల్జియం, నెదర్లాండ్స్ వేదికలుగా జరగనుంది. అంతకుముందు మూడో స్థానంకోసం జరిగిన పోరులో స్కాట్లాండ్ ఏకైక గోల్‌తో ఇటలీపై గెలుపొందింది. కాగా.. భారత్, ఇంగ్లండ్‌తో పాటు స్కాట్లాండ్‌కు కూడా వరల్డ్‌కప్ బెర్త్ దక్కింది.
ఆదినుంచే దూకుడు: వరల్డ్ తొమ్మిదో ర్యాంకర్ భారత్ మ్యాచ్ ఆరంభంనుంచే దూకుడు ప్రదర్శించింది. 60 నిమిషాలపాటు అలుపెరగని దాడులతో విజృంభించింది. కానీ బలమైన ప్రత్యర్థి డిఫెన్స్ ఛేదించలేకపోయింది. రెండో నిమిషంలోనే మనోళ్లకు పెనాల్టీ కార్నర్ లభించినా..నవ్‌నీత్ డ్రాగ్‌ఫ్లిక్‌ను ఇంగ్లండ్ కీపర్ అడ్డుకుంది. మరోవైపు 13వ నిమిషంలో ఇంగ్లండ్‌కు పెనాల్టీ కార్నర్ దక్కింది. సూపర్ ఫామ్‌లో ఉన్న గ్రేస్ పొరపాటుకు తావియ్యకుండా బంతిని గోల్‌పో్‌స్టలోకి పంపింది. దాంతో ఇంగ్లండ్ 1-0తో ముందంజలో నిలిచింది. ఒక గోల్ వెనుకంజలో నిలిచినా వెరవకుండా భారత్ తన దాడుల ఉధృతిని పెంచింది. ఇంగ్లండ్ కూడా అంతే దీటుగా బదులివ్వడంతో రెండో క్వార్టర్ హోరాహోరీగా సాగింది. అయితే సర్కిల్ లోపల పాస్‌లను అందుకోవడంలో సమన్వయలోపంతో.. భారత్ గోల్స్ కొట్టే యత్నాలు ఫలించలేదు. నవ్‌నీత్ దాడులతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసినా..సహచరులనుంచి ఆమెకు సహకారం లభించలేదు. మరోవైపు 43వ నిమిషంలో ఇంగ్లండ్‌కు మరో గోల్ చాన్స్ దక్కింది. నీల్ ఎలిజబెత్ కొట్టిన పాస్ భారత డిఫెండర్ మనీషా చౌహాన్ కాలికి తగిలి వెనక్కి వచ్చింది. దానిని మళ్లీ నీల్ గోల్ పోస్ట్‌లోకి పంపడంతో ఇంగ్లండ్ ఆధిక్యం రెట్టింపైంది. ఈనేపథ్యంలో..స్కోరు సమం చేసేందుకు ద్వితీయార్థంలో భారత్ తీవ్రంగా ప్రయత్నించింది. కానీ ఇంగ్లండ్ డిఫెన్స్ వాటిని సమర్థంగా అడ్డుకుంది. చివరి క్వార్టర్‌లోనూ భారత్ యత్నాలు ఫలించలేదు. మ్యాచ్ ముగిసే క్షణాల్లో భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించినా గోల్‌గా మలచలేకపోయింది.
ఇవి కూడా చదవండి...
గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ
కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవితో మంత్రి సీతక్క భేటీ.. చర్చించిన అంశాలివే