Share News

గ్యాస్‌ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ

ABN , Publish Date - Mar 14 , 2026 | 10:29 AM

గ్యాస్ సరఫరా అంశంపై పలువురు మంత్రులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏం చేయాలో, ఎంత చేయాలో అంతా చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

గ్యాస్‌ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ
CM Chandrababu Naidu

అమరావతి, మార్చి 14: రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై పలువురు మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఈరోజు(శనివారం) టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో గ్యాస్ సరఫరా అంశంపై వివరంగా చర్చించారు. ప్రస్తుత పరిస్థితులను ముఖ్యమంత్రికి మంత్రి పయ్యావుల కేశవ్(Minister Payyavula Keshav) వివరించారు. ఉదయం 11:30 గంటలకు గ్యాస్ సరఫరా అంశంపై ఏర్పాటైన మంత్రుల సబ్ కమిటీ భేటీ అవుతున్నట్లు సీఎంకు మంత్రులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏం చేయాలో, ఎంత చేయాలో అంతా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.


కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని అన్ని ఎఫర్ట్స్ పెట్టి సమస్య లేకుండా ప్రయత్నాలు చేయాలని సీఎం ఆదేశించారు. హోటళ్లు సహా భాగస్వామ్య పక్షాలతో మాట్లాడి వాస్తవ పరిస్థితికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని మంత్రులకు చంద్రబాబు సూచనలు ఇచ్చారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా చూడాలని మంత్రులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ క్యాబినెట్ సబ్ కమిటీలో మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు ఉన్నారు. ఈరోజు ఉదయం 11:30 గంటలకు సివిల్ సప్లై భవనంలో మంత్రుల సమావేశం జరగనుంది.


ఇవి కూడా చదవండి...

ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్న వైసీపీ నేతలు.. కారణమిదే

ప్రత్యేక విమానంలో విశాఖకు పవన్.. నేతల స్వాగతం

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 14 , 2026 | 11:05 AM