పిల్లల విక్రయాలపై సమగ్ర దర్యాప్తు: డీఎస్పీ శ్రావణ్ కుమార్
ABN , Publish Date - Mar 14 , 2026 | 09:17 AM
పిల్లల విక్రయాలపై సమగ్ర విచారణ చేస్తున్నామని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. తమకు లభించిన ఆధారాల సహాయంతో ఈ కేసును పూర్తిగా దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.
ఏలూరు జిల్లా, కైకలూరు, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): పిల్లల విక్రయాలపై సమగ్ర విచారణ చేస్తున్నామని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ (DSP Shravan Kumar) పేర్కొన్నారు. తమకు లభించిన ఆధారాల సహాయంతో ఈ కేసును పూర్తిగా దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. పిల్లల విక్రయాలపై వస్తున్న ప్రచారం నేపథ్యంలో డీఎస్పీ ఈరోజు(శనివారం) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల కైకలూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఐదుగురు పిల్లలను సంతానం లేని కొందరు దంపతులు దత్తత తీసుకున్నట్లు గుర్తించామని అన్నారు.
బాలల సంరక్షణ శాఖ అధికారుల ఫిర్యాదు..
ఇందులో ముగ్గురు పిల్లలు వారి బంధువులే కాగా మిగతా ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదని డీఎస్పీ శ్రావణ్ కుమార్ చెప్పుకొచ్చారు. ఈ విషయంపై జిల్లా బాలల సంరక్షణ శాఖ అధికారుల ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. చట్ట వ్యతిరేకంగా పిల్లలను పెంచుకోవడానికి దంపతులు తీసుకోవడంపై తమకు బాలల సంరక్షణ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారని అన్నారు. అధికారుల ఫిర్యాదుతో కైకలూరు రూరల్ సీఐ రవికుమార్ కేసు నమోదు చేశారని వెల్లడించారు.
అసత్యాలు ప్రచారం చేస్తే చర్యలు..
పోలీసుల అదుపులో పలువురు అనుమానితులు ఉన్నారని డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. శిశువులను ఎవరి ద్వారా కొనుగోలు చేశారు, ఏమైనా ఆర్థికపరమైన లావాదేవీలు జరిగాయనే అంశాలపై సమగ్ర విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తమ దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రకృతి సాగుతో అద్భుతాలు సృష్టిస్తున్నారు.. ఆ రైతుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు
విద్యార్థులకు నాణ్యతలేని భోజనం.. మంత్రి లోకేశ్ ఆగ్రహం
ఉద్దానం కిడ్నీ బాధితులకు ప్రభుత్వం చారిత్రాత్మక పరిష్కారం.. తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స
Read Latest AP News And Telangana News And International News And Telugu News