ప్రత్యేక విమానంలో విశాఖకు పవన్.. నేతల స్వాగతం
ABN , Publish Date - Mar 14 , 2026 | 10:10 AM
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విశాఖకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో పవన్‌కు నేతలు స్వాగతం పలికారు.
విశాఖపట్నం, మార్చి 14: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేశ్ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, సుందరపు విజయ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రెటరీ శశిభూషణ్ కుమార్ తదితరులు పవన్‌ను కలిసి స్వాగతం పలికారు. మరికాసేపట్లో హెలికాఫ్టర్‌లో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరుకు బయలుదేరనున్నారు పవన్.
జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ పర్యటన జరగనుంది. పాడేరు నియోజకవర్గం నందిగరువు గ్రామంలో గిరిజనుల మధ్య ఈ వేడుకలు నిర్వహించనున్నారు. పాడేరులో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి, ప్రధానమంత్రి జన్ మన్ పథకం కింద 'అడవితల్లి బాట' పేరిట నిర్మించిన రహదారులను డిప్యూటీ సీఎం పరిశీలించనున్నారు. ఆపై నిర్మాణం పూర్తైన రహదారులను పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. అనంతరం గిరిజనులతో 'మాటా-మంతి' కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలను తెలుసుకుని చర్చించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
ఇవి కూడా చదవండి...
ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్న వైసీపీ నేతలు.. కారణమిదే
Read Latest AP News And Telugu News