పాక్ ఆటగాళ్లకు రూ.50లక్షల జరిమానా.. ఆ వార్తలను ఖండించిన పీసీబీ
ABN , Publish Date - Mar 14 , 2026 | 04:14 PM
టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్థాన్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో పాక్ ఆటగాళ్లకు పీసీబీ ఒక్కొక్కరికి రూ.50లక్షల జరిమానా విధించిందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పందించింది. ఆ వార్తలన్నింటినీ ఖండించింది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్థాన్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. పసికూన జట్లపై కూడా పాక్ బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. దీంతో సూపర్ 8 స్టేజిలోనే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి పాకిస్థాన్ ప్లేయర్లకు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో తీవ్రంగా విఫలమైన ఆటగాళ్లకు పీసీబీ ఒక్కొక్కరికి రూ.50లక్షల జరిమానా విధించిందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పందించింది. ఆ వార్తలన్నింటినీ ఖండించింది.
‘ప్రపంచ కప్ టోర్నీ తర్వాత పాకిస్థాన్ ప్లేయర్లపై జరిమానా విధించారనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నిర్ణయం పీసీబీ తీసుకోలేదు. అలాంటి ప్రతిపాదన కూడా లేదు. ఇవన్నీ సోషల్ మీడియాలో వచ్చిన వదంతులే. ఆ వార్తల్లో నిజం లేదు. ఏ ప్లేయర్‌కు పీసీబీ జరిమానా విధించలేదు’ అని పీసీబీ అధికారి ఆమిర్ మీర్ వెల్లడించారు.
అవసరమైతే నేనే చెల్లిస్తా..
పాక్ ప్లేయర్లపై జరిమానా విధించారనే వార్తలపై ఆ దేశ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘అవసరం అయితే ఆటగాళ్ల తరఫున ఆ రూ.50లక్షలు నేనే చెల్లిస్తా. దేశం లేదా క్రికెట్ అభివృద్ధికి అది ఉపయోగపడితే ఆ జరిమానాను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా’ అని మీర్ పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా.. పొట్టి ప్రపంచ కప్ 2026లో సల్మాన్ అలీ ఆఘా నేతృత్వంలో పాకిస్థాన్ జట్టు బరిలోకి దిగింది. పెద్దగా ప్రభావం చూపలేక సూపర్-8 దశలోనే నిష్క్రమించింది. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్‌లో నాకౌట్ దశకు చేరకుండానే ఇంటి ముఖం పట్టింది. ముఖ్యంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ తీవ్రంగా విఫలమైంది. ఆ మ్యాచ్‌లో 114 పరుగులకే ఆలౌట్ అయి 61 పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది.
ఇవి కూడా చదవండి:
ఆ ముగ్గురు క్రికెట్ దిగ్గజాలకు ‘లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డ్’.. ప్రకటించిన బీసీసీఐ
రూల్స్ ప్రకారం అది రనౌటే.. కానీ న్యాయం కాదు: సల్మాన్ అఘా