సల్మాన్ రనౌట్‌ను రోడ్డుప్రమాదాల నివారణకు వాడుకున్న ట్రాఫిక్ పోలీసులు
ABN , Publish Date - Mar 15 , 2026 | 04:38 PM
ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ సల్మాన్ అలీ అఘా రనౌటైన తీరు చర్చనీయాంశమైంది. అయితే తాజాగా ఈ రనౌట్‌ను రావల్పిండి ట్రాఫిక్ పోలీసులు.. రోడ్డు ప్రమాదాల నివారణకు వాడుకున్నారు.
స్పోర్ట్స్ డెస్క్: ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్(Pakistan) సల్మాన్ అలీ అఘా రనౌటైన తీరు చర్చనీయాంశమైంది. కొంతమంది సల్మాన్ అఘాకు మద్దతుగా నిలుస్తుంటే, మరికొందరు అతడిదే తప్పు అని అభిప్రాయపడుతున్నారు. అయితే తాజాగా ఈ రనౌట్‌ను రావల్పిండి ట్రాఫిక్ పోలీసులు.. రోడ్డు ప్రమాదాల నివారణకు వాడుకున్నారు. వారు చేసిన ఓ పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
'రోడ్డు మీదైనా, మైదానంలోనైనా మీ భద్రత మీ చేతుల్లోనే ఉంటుంది' అని సల్మాన్ రనౌట్‌ను ఉదాహరణగా తీసుకుని రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. 'మిమ్మల్ని మీరు నమ్మండి, అప్రమత్తంగా ఉండండి. సురక్షితంగా ఉండడానికి తెలివైన నిర్ణయాలు తీసుకోండి' అంటూ రోడ్డపై మిరాజ్-సల్మాన్ ఉన్న ఫొటోను పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
అసలు ఏం జరిగిందంటే?
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో.. పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో 39వ ఓవర్ వేసిన మెహిది హసన్ మిరాజ్ బౌలింగ్‌లో మహమ్మద్ రిజ్వాన్ స్ట్రైట్ షాట్ ఆడాడు. బంతి నాన్‌స్ట్రైకర్‌లో ఉన్న సల్మాన్ అఘా బ్యాట్‌కు తాకింది. దాంతో ఆ బంతిని సల్మాన్ అలీ అఘా బౌలర్‌కు అందించే ప్రయత్నం చేశాడు.అయితే ఇదే సమయంలో మిరాజ్ బంతిని అందుకుని స్టంప్స్‌ను పడగొట్టాడు. అప్పటికే సల్మాన్ క్రీజు బయట ఉండడంతో థర్డ్ అంపైర్‌గా రనౌట్‌గా ప్రకటించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సైతం తెగ వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
ఆ ఇద్దరు టాప్ ఆర్డర్‌లో ఆడటం కష్టం.. ముంబై జట్టుపై హర్భజన్ కీలక వ్యాఖ్యలు
భారత్ వరుసగా అద్భుతాలు సాధించడం గర్వంగా ఉంది: రోహిత్ శర్మ