Share News

వైరల్ అవ్వాలని రీల్‌కు ప్లాన్ చేసింది.. చివరకు వెనక్కు చూసి షాక్ అయింది..

ABN , Publish Date - Mar 15 , 2026 | 04:31 PM

ఓ యువతి వినూత్న రీల్ చేయాలనే ఉద్దేశంతో ఇంటి ముందున్న చిన్న సందులో కెమెరా సెట్ చేసింది. ఆ తర్వాత కెమెరా ముందు విచిత్రంగా డాన్స్ చేస్తూ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది. ఇలా కాలు కదిపిందో లేదో..

వైరల్ అవ్వాలని రీల్‌కు ప్లాన్ చేసింది.. చివరకు వెనక్కు చూసి షాక్ అయింది..

ప్రస్తుతం చాలా మంది యువతీ యువకులు చదువు, ఉద్యోగాలపై ఎంత శ్రద్ధ పెడుతున్నారో తెలీదు గానీ.. రీల్స్‌పై మాత్రం ఎనలేని శ్రద్ధ పెడుతున్నారు. వైరల్ అయితే ఎగిరి గంతేయడం, వ్యూస్ రాకపోతే కుంగిపోవడం సర్వసాధారణమైంది. కొందరు ఏదోటి చేసి వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో వారికి ఊహించని షాక్‌లు తగులుతుంటాయి. ఈ తరహా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి రీల్ చేసేందుకు డాన్స్ స్టార్ట్ చేసింది. మధ్యలో ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి వినూత్నంగా రీల్ చేయాలనే ఉద్దేశంతో ఇంటి ముందున్న చిన్న సందులో కెమెరా సెట్ చేసింది. ఆ తర్వాత కెమెరా ముందు విచిత్రంగా (young woman dancing in front of the camera) డాన్స్ చేస్తూ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది. అయితే, ఇలా కాలు కదిపిందో లేదో.. అంతలోనే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కాస్త దూరంలో ఉన్న ఓ కోతి.. ఉన్నట్టుండి యువతి వైపు దూసుకొచ్చింది.


‘ఎప్పుడూ రీల్స్ చేయకపోతే.. వేరే పని ఏదైనా చేసుకోవచ్చు కదా’.. అన్నట్లుగా యువతిపై (monkey chased the young woman) దాడి చేయాలని చూస్తుంది. అయితే వెంటనే అప్రమత్తమైన ఆ అమ్మాయి.. పరుగు పరుగున ఇంట్లోకి దూరిపోయింది. ఆ తర్వాత తన ఫోన్‌ను కోతి ఎక్కడ తీసుకెళ్లిపోతుందో అన్న భయంతో.. మళ్లీ బయటికి వచ్చి తన ఫోన్‌ను తీసుకెళ్లిపోయింది. ఇలా వినూత్నమైన రీల్ చేయాలని చూసిన యువతికి.. కోతి షాక్ ఇచ్చిందన్నమాట.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఏదో చేయాలని చూస్తే.. చివరికి ఇంకేదో అయిందే’.. అంటూ కొందరు, ‘ఈ కోతి భలే షాక్ ఇచ్చిందిగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వార్త రాస్తున్న సమయానికి ఈ వీడియో 220కి పైగా లైక్‌లు, 61 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

గ్యాస్ లేదని ఎలక్ట్రిక్ స్టవ్ కొన్నాడు.. తీరా కూర ఉడికే ముందు చూసి ఖంగుతిన్నాడు..

వీరి తెలివి మామూలుగా లేదుగా.. రైల్వే ఏసీ కోచ్‌‌ను ఎలా మార్చారో చూడండి..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 15 , 2026 | 04:34 PM