Share News

ప్లాస్టింగ్ చేయడంలో మాస్టర్ డిగ్రీ చేసినట్టున్నాడు.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ABN , Publish Date - Mar 15 , 2026 | 01:29 PM

ఓ తాపీ మేస్త్రీ గోడకు ప్లాస్టింగ్ చేస్తున్నాడు. ఇందులో నవ్వుకోవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. అతను అందరిలా ప్లాస్టింగ్ చేసి ఉంటే ఎలాంటి విచిత్రమూ ఉండేది కాదు.. కానీ ఇతను పూర్తి విరుద్ధంగా ప్లాస్టింగ్ చేశాడు..

ప్లాస్టింగ్ చేయడంలో మాస్టర్ డిగ్రీ చేసినట్టున్నాడు.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

కాలక్షేపం కోసం ఒకప్పుడు సినిమా థియేటర్లకు వెళ్లే వాళ్లు. అయితే ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో స్మార్ట్ ఫోన్‌లోనే అన్నీ దొరుకుతున్నాయి. ఒక్కసారి నెట్టింట్లోకి వెళ్లామంటే.. తిరిగి రావడం అంత సులభం కాదు. వింతలు, వినోదం, విన్యాసాలకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వీడియోలను చూసినప్పుడు తెగ నవ్వు వస్తుంటుంది. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ తాపీ మేస్త్రీ గోడకు ప్లాస్టింగ్ చేసే పద్ధతిని చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ఇతడి తెలివి తెల్లారిపోనూ.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ తాపీ మేస్త్రీ గోడకు ప్లాస్టింగ్ చేస్తున్నాడు. ఇందులో నవ్వుకోవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. అతను అందరిలా ప్లాస్టింగ్ చేసి ఉంటే ఎలాంటి విచిత్రమూ ఉండేది కాదు.. కానీ ఇతను పూర్తి విరుద్ధంగా ప్లాస్టింగ్ చేయడంతో వీడియో వైరల్ అవడానికి కారణమైంది. ప్లాస్టింగ్ చేసే సమయంలో రంధ్రానికి సిమెంట్ పూసి కవర్ చేయాల్సి వస్తుంది.


రంధ్రాలను పూడ్చడం కోసం నేలపై ఉన్న సిమెంట్ తీసుకుని.. (Man plastering wall) ఆ గుంటను పూడ్చాలి. కానీ ఇతను మాత్రం అలా కాకుండా.. గోడపై ఆల్రెడీ ప్లాస్టింగ్ చేసిన ప్రాంతంలోని సిమెంట్ మిశ్రమాన్ని తీసుకుని, పైన ఉన్న గుంటను పూడ్చాడు. దీంతో అక్కడ మళ్లీ కొత్తగా గుంట పడింది. దాన్ని పూడ్చడానికి పక్కన ఇంకో గుంట చేసి సిమెంట్ తీసుకున్నాడు. ఇలా అతను గోడపై ఉన్న ప్లాస్టింగ్‌పై రంధ్రాలు చేస్తూ, అదే సిమెంట్‌తో ఆ రంధ్రాలను పూడుస్తున్నాడు.


ఇతడి విచిత్ర నిర్వాకం అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది. ఇదంతా అతను కావాలని చేశాడో.. లేక నిజంగానే అలా చేశాడో తెలీదు గానీ.. వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘సోమరితనానికి ఇది కొత్త పేటెంట్‌లా ఉందే’.. అంటూ కొందరు, ‘పని చేయకుండా జీతం తీసుకోవడానికి ఇదే సరైన మార్గం’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.9 లక్షలకు పైగా లైక్‌లు, 25 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

గ్యాస్ లేదని ఎలక్ట్రిక్ స్టవ్ కొన్నాడు.. తీరా కూర ఉడికే ముందు చూసి ఖంగుతిన్నాడు..

వీరి తెలివి మామూలుగా లేదుగా.. రైల్వే ఏసీ కోచ్‌‌ను ఎలా మార్చారో చూడండి..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 15 , 2026 | 02:50 PM