Share News

ఇలాంటి చోరీ ఎక్కడైరా చూశారా.. ఈ దొంగ నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - Mar 14 , 2026 | 07:35 AM

కర్నాటకలోని బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి రాత్రి వేళ బైకుపై వచ్చి ఓ ఇంటి ముందు ఆపాడు. బండి రోడ్డు పక్కన పార్క్ చేసి, నేరుగా అక్కడున్న గేటు తీసుకుని లోపలికి వెళ్లాడు. లోపలికి వెళ్లాక.. అటూ, ఇటూ చూసి చివరకు..

ఇలాంటి చోరీ ఎక్కడైరా చూశారా.. ఈ దొంగ నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఇండియాలో ఎల్‌పీజీ సిలిండర్ల సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. సిలిండర్లు లేక ఇప్పటికే చాలా వరకూ హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. ఉన్న వాటిలో కూడా టిఫిన్స్‌ను ఒకటి రెండు మాత్రమే అందిస్తున్నారు. గ్యాస్ కోసం ప్రజలు, హోటల్ యజమానులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అయితే తాజాగా బెంగళూరులో చోటు చేసుకున్న ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఓ దొంగ ఇంటి ఆవరణలోకి చొరబడి.. ఏం చేశాడో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కర్నాటకలోని బెంగళూరులో (Bangalore) ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి రాత్రి వేళ బైకుపై వచ్చి ఓ ఇంటి ముందు ఆపాడు. బండి రోడ్డు పక్కన పార్క్ చేసి, నేరుగా అక్కడున్న గేటు తీసుకుని లోపలికి వెళ్లాడు. లోపలికి వెళ్లాక.. అటూ, ఇటూ చూసి చివరకు అక్కడే ఉన్న సిలిండర్‌ను ఎత్తుకుని బయటికి వెళ్లాడు. దాన్ని ఎంచక్కా బైకుపై పెట్టుకుని చల్లగా అక్కడి నంచి జారుకున్నాడు. ఇలా ఆ దొంగ ప్రస్తుత పరిస్థితిని దృష్టిని దృష్టిలో ఉంచుకుని.. కేవలం గ్యాస్ సిలిండర్‌ను మాత్రమే టార్గెట్ చేశాడన్నమాట.


ఈ చోరీ ఘటన మొత్తం (Gas cylinder theft) అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సిలిండర్ల కొరత సమస్య ఏ స్థాయిలో ఉందో ఈ చోరీ ఘటన చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం ఆయిల్ సంక్షోభం, ఎల్‌పీజీ కొరత కారణంగా.. సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో అత్యధిక ధర వెచ్చించి కొనాల్సి వస్తోంది. అయినా కొన్నిచోట్ల సిలిండర్లు దొరకడం లేదని కొందరు వాపోతున్నారు.


మరోవైపు గ్యాస్ కొరత కారణంగా హోటళ్లలో ఆహార పదార్థాల రేట్లు కూడా పెంచేశారు. ఇలాంటి ఈ తరుణంలో ఈ గ్యాస్ సిలిండర్ చోరీ ఘటనలు తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘సిలిండర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి.. ఇంటి లోపల భద్రంగా ఉంచుకోండి’.. అంటూ కొందరు, ‘దొంగలు రూటు మార్చారు.. మీ సిలిండర్లు జాగ్రత్త’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో వార్త రాస్తున్న సమయానికి ఈ వీడియో 7 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

వీరి తెలివి మామూలుగా లేదుగా.. రైల్వే ఏసీ కోచ్‌‌ను ఎలా మార్చారో చూడండి..

వావ్..! వాట్ ఎ టాలెంట్.. ఈ డ్రైవర్ పనితనం చూస్తే శభాష్ అనాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 14 , 2026 | 07:56 AM